Begin typing your search above and press return to search.

అరుదైన ఘ‌నత వెంక‌య్య సొంతం

By:  Tupaki Desk   |   3 July 2019 7:04 AM GMT
అరుదైన ఘ‌నత వెంక‌య్య సొంతం
X
చ‌ట్ట‌ స‌భ‌ల‌న్నంత‌నే స‌మ‌యం మొత్తం అరుపులు.. కేక‌లు. . నినాదాలకే ప‌రిమితమ‌వుతుంటాయి. చ‌ట్ట‌స‌భ‌లు జ‌రిగే ప్ర‌తి క్ష‌ణం ఎంతో ఖ‌రీదైన‌ది. ఇలాంటివేళ‌.. స‌భ్యులు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించే వీలుంటుంది. కానీ.. నేత‌ల రాజ‌కీయం ముందు చ‌ట్ట‌స‌భ‌లు త‌ర‌చూ తేలిపోతుంటాయి. అందుకు భిన్న‌మైన దృశ్యం తాజాగా రాజ్య‌స‌భ‌లో ఆవిష్కృత‌మైంది. రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించ‌ని ప‌రిస్థితి. అందుకు భిన్న‌మైన సీన్ తాజాగా చోటు చేసుకుంది.

ఇలాంటి స‌న్నివేశం చాలా అరుదుగా చోటు చేసుకుంటూ ఉంటుంది. దాదాపు 15 నెల‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్ర‌శ్నోత్త‌రాల జాబితాలో ఉన్న 15 ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం ఇచ్చారు. అంతేకాదు.. ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌భ్యులు వేసిన ఉప ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాధానం ఇవ్వ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి.

స‌భ‌ను సాఫీగా జ‌రిపేందుకు ఉప‌రాష్ట్రప‌తి హోదాలో ఉన్న వెంక‌య్య‌నాయుడి చొర‌వ కూడా తాజా ప‌రిణామానికి కార‌ణంగా చెప్పాలి. అన‌వ‌స‌ర‌మైన ఉపోద్ఘాంతాల్ని క‌ట్ట‌డి చేయ‌టంతో విలువైన స‌మ‌యం వృధా కాక‌పోవ‌టంతో స‌భ్యులు సంధించిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే ప‌రిస్థితి. మొత్తం 13 పార్టీల‌కు చెందిన 36 మంది స‌భ్యులు ప్ర‌శ్న‌లు.. అనుబంధ ప్ర‌శ్న‌లు వేసి స‌మాధానాలు రాబ‌ట్టుకున్నారు.

ఇలా స‌భ్యులు సంధించిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌ట్టుకోవ‌టం గ‌త ఏడాది జ‌న‌వ‌రి 2న చోటు చేసుకోగా.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అలాంటి సీన్ పెద్ద‌ల స‌భ‌లో ఆవిష్కృత‌మైంది. ఇలాంటి ప‌రిస్థితికి స‌భాధ్య‌క్షుడు వెంక‌య్య‌నాయుడితో పాటు.. స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు కూడా క్రెడిట్ ద‌క్కుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.