Begin typing your search above and press return to search.
బాబు సభ.. రాజధానిపై చిరంజీవిని బెదిరించారట..!
By: Tupaki Desk | 11 Jan 2020 11:40 AM GMTఅమరావతిని కాపాడుకోవడానికి జోలెపట్టి రాష్ట్రమంతా విరాళాలు సేకరిస్తున్న చంద్రబాబు తాజాగా రాజమండ్రిలో పర్యటించారు. అక్కడ కూడా జోలెపట్టి సేమ్ సీన్ రిపీట్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో చంద్రబాబు జేఏసీ, అఖిలపక్షం నేతలతో రాజమండ్రిలో హల్ చల్ చేశారు.
చంద్రబాబు ప్రసంగం ఆసాంతం హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని.. అమరావతిని చేస్తానని ప్రసంగించారు. సీఎం జగన్ - డీజీపీపై దుమ్మెత్తి పోశారు.
ఇక 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఫుట్ బాల్ ఆడుకుంటానని.. నా వయసు అయిపోలేదని.. తనది ఉడుకు రక్తమని చంద్రబాబు సభలో ఉడికిపోయారు. వయసు పెరిగినా తన ఆలోచనలు 25 ఏళ్ల యువకుడిలానే ఉన్నాయని చెప్పుకున్నారు.
ఇక చంద్రబాబు తర్వాత మాట్లాడిన జేఏసీలో ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ సినీ హీరో చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులకు అనుకూలంగా చిరంజీవిని బెదిరించి మాట్లాడించారని ఆడిపోసుకున్నారు. ఈ వ్యాఖ్యలు దుమారాం రేపాయి.
40 ఏళ్ల సినీ కెరీర్.. రాజకీయాల్లో ఆరితేరిన చిరంజీవిని బెదిరించారు అంటావా అని చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పటికే సదురు ప్రొఫెసర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవికి వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండవా అని ఫ్యాన్స్ బాబును, ప్రొఫెసర్ ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.