Begin typing your search above and press return to search.

థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..? హెచ్.సీ యూనివర్సిటీలో ఉద్రిక్తత

By:  Tupaki Desk   |   3 Dec 2022 8:38 AM GMT
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..? హెచ్.సీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
X
ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో కలకలం చోటుచేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్.సీ.యూ)లో దారుణం చోటుచేసుకుంది. ఈ వర్సిటీలో థాయిలాండ్ కు చెందిన విద్యార్థినిపై వర్సిటీ ప్రొఫెసర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.. ఆ సమయంలో విద్యార్థిని తృటిలో తప్పించుకొని పారి పోయినట్టు చెబుతున్నారు. బాధిత విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ప్రొఫెసర్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెసర్ పోలీసుల అదుపులో ఉన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి వచ్చిన గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, థాయిలాండ్ యువతి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. 'హిందీ నేర్పిస్తానని.. పుస్తకం కోసమంటూ పిలిచి ప్రొఫెసర్ తనపై అత్యాచారానికి ప్రయత్నించినట్టు' యువతి పోలీసులకు తెలిపింది.

వర్సిటీలో విద్యార్తినిపై అత్యాచారయత్నం జరగడంతో విద్యార్థులంతా భగ్గుమన్నారు. దుశ్చర్యకు పాల్పడిన ప్రొపెసర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ గేటు ఎదుట భైటాయించి ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోలన చేపట్టారు. ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇక విద్యార్థుల ఆందోళనతో హెచ్.సీ.యూలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఆచార్యులే దారుణాలకు పాల్పడితే ఇంకెవరికి చెప్పాలంటూ పలువురు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రొఫెసర్ పై చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.

ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్టు విద్యార్థిని ఆరోపిస్తోంది. పూర్తి వివరాలు తెలిసే వరకూ ఇందులో ఎవరి పాత్ర ఎంత అనేది పోలీసులు అధికారికంగా తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.