Begin typing your search above and press return to search.

నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడి తాజా వ్యాఖ్యలు విన్నారా?

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 PM GMT
నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడి తాజా వ్యాఖ్యలు విన్నారా?
X
తెలంగాణ రాష్ఠ్ర సాధన అన్నంతనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కానీ.. తెలంగాణ సాధన వెనుక లక్షలాది మంది త్యాగాలు.. తెలంగాణ తప్పించి ఇంకేమీ వద్దు అనుకున్నోళ్లకు కొదవ లేదు. తెలంగాణ సాధనను పవర్ ప్యాక్ గా చూసిన కేసీఆర్.. తాను అనుకున్నట్లే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టటంలో విజయం సాధించారనే చెప్పాలి. కానీ.. తెలంగాణ వస్తే మరింకేమీ వద్దని ఫీలైన ఎంతో మంది నికార్సైన తెలంగాణ వాదుల విషయానికి వస్తే.. ప్రొఫెసర్ హరగోపాల్ కానీ కోదండరాం లాంటోళ్లు చాలా మందే ఉన్నారు.

వీరెవరూ కూడా రాష్ట్ర సాధన తర్వాత పదవుల్ని కోరుకోలేదు. ఒకవేళ కోరుకుంటే.. అత్యుత్తమ పదవుల్లో వారు ఉండేవారు. ఆ మాటకు వస్తే పదవులు ఆఫర్ చేస్తే.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ప్రతిఫలం కోసం కాదని తేల్చి చెప్పిన నికార్సైన ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన ప్రొఫెసర్ హరగోపాల్.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు.. తెలంగాణ రాష్ట్ర సాధన వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందన్న భావన కలిగేలా ఉన్నాయన్న ఆవేదన ఆయన మాటలు ఉండటం గమనార్హం.

కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని ప్రస్తావించిన ఆయన.. "చదువు కుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుటే... టీచర్లు గా మా కర్తవ్యం మేము చేస్తున్నామా అనే డౌట్ వచ్చింది. ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా.. నేరం చేస్తుంది. రాజకీయ పార్టీలు సమాజానికి ఏ విలువలు ఇస్తున్నామనేది చూసుకోవాలి. హైదరాబాద్ మహా నగరం లో జరుగుతున్న సంఘటనలు.. అధికార పార్టీ తీరు మాకు వేదన కలిగిస్తున్నాయి. తెలంగాణ వస్తె మెరుగైన సమాజం వస్తుంది అని అనుకున్నాం కానీ.. రేప్ లు..అత్యాచారాలు ఏంటి?' అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ ను ప్రజాస్వామ్య సమాజం గా మార్చే ప్రయత్నం చేయడం లేదన్న ప్రొఫెసర్ సార్ మాటల్ని విన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుతో తాము కన్న కల సాకారం కాలేదన్న ఆవేదన కొట్టొచ్చినట్లు కనిపించక మానదు.

మిగిలిన వారి మాటల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. నికార్సైన తెలంగాణ వాది అయిన ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు సైతం తెలంగాణ సాధనతో తాము కోరుకున్నది జరగలేదన్న మాటలు కొత్త ఆలోచనలకు తావిస్తాయని చెప్పక తప్పదు.