Begin typing your search above and press return to search.

భార‌త్‌పై ప‌లు దేశాల నిషేధం.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   21 April 2021 2:41 AM GMT
భార‌త్‌పై ప‌లు దేశాల నిషేధం.. రీజ‌నేంటి?
X
భార‌త దేశాన్ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన బ్రిట‌న్‌, అమెరికా దేశాలు స‌హా.. మ‌న దా యాది దేశం పాకిస్థాన్‌.. ఇప్పుడు ఛీకొడుతున్నాయి. భార‌త్‌లో క‌రోనా తీవ్రత పెరిగిన నేప‌థ్యంలో ఆయా దేశాలు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి. భార‌త్ నుంచి ఎవ‌రినీ రానివ్వ‌బోమ‌ని.. భారత్‌కు ఎవ‌రూ వెళ్ల‌రాద ‌ని కూడా అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ దేశ పౌరులను ఆదేశించారు. అంతేకాదు. ఈ నెల 22 నుంచి అమె రికా నుంచి భార‌త్‌కు న‌డిచే విమానాల‌పై నిషేధం విధించ‌నున్న‌ట్టు వైట్ హౌస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఇక‌, అత్యవసర పనిలపై భారత్‌కు వెళ్లదలచుకునే వారు.. తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను వేయించుకోండి’ అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. మ‌రోవైపు భార‌త్ మిత్ర దేశం బ్రిట‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆ దేశం కూడా భార‌త్ పై తీవ్ర నిర్ణ‌య‌మే తీసుకుంది. భారత్‌లో రెం డో ద‌శ క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తున్న నేప‌థ్యంలో ఎవ‌రూ ఆదేశానికి వెళ్ల‌రాదంటూ.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్‌.. భార‌త‌కు రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు. అంతేకాదు.. బ్రిట‌న్ పౌరుల‌ను కూడా ఆయ‌న భార‌త్‌కు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

మ‌రోవైపు దాయాది దేశం పాకిస్థాన్ కూడా భార‌త్ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించింది. త‌క్ష‌ణ‌మే పాకిస్థాన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధిస్తున్న‌ట్టు పాక్ ప్ర‌ధాని.. ప్ర‌క‌టించారు. ఇక‌, పాక్ నుంచి రంజాన్ నేప‌థ్యంలో ఎవ‌రూ భార‌త్ కు వెళ్ల‌రాద‌ని కూడా ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. బంధువులు, మిత్రులు ఈ విష‌యం ఓ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా సూచించారు. మ‌రి ఇలా.. భార‌త్‌పై ఆయా దేశాలు ఆంక్ష‌లు విధించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. వైర‌స్ వ్యాప్తే.. అయితే.. ఇదంతా .. ప్ర‌ధాని మోడీ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే జ‌రిగింద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

క‌రోనా తొలిద‌శ‌.. త‌గ్గుతోంది.. ఫ‌ర్వాలేదు.. అనుకుంటున్న స‌మ‌యంలో టీకా వ‌చ్చింది. దీంతో దేశ‌వ్యాప్తంగా పండుగ వాతావార‌ణం నెల‌కొంది. ఇంకేముంది.. టీకా వేసుకుంటే త‌గ్గుంద‌ని ప్ర‌భుత్వం కూడా ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ఇత‌ర దేశాల‌కు కూడా టీకా ఎగుమ‌తులు చేశారు. అయితే.. అదేస‌మ‌యంలో మ‌రో ఆరు మాసాల పాటు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసి ఉంటే.. ప‌రిస్థితి ఇంత దిగ‌జారేది కాద‌ని అంటున్నారు నిపుణులు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌లు, జాత‌రలు, కుంభ‌మేళాలు.. అంటూ. చేసిన హ‌డావుడి కార‌ణంగా.. వైర‌స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంద‌ని.. ఇదే ప‌రిస్థితి మ‌రో 10 రోజులు కొన‌సాగితే.. తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు. మొత్తానికి మోడీ నిర్ల‌క్ష్యం.. ప్ర‌పంచ దేశాల ముందు ప‌రువు పోగొట్టుకున్న‌ట్టే అయింద‌ని చెబుతున్నారు.