Begin typing your search above and press return to search.
గోయల్ గోల్ మాల్..కోట్లు ఎగవేసిన సంస్థకు భరోసా
By: Tupaki Desk | 4 April 2018 4:57 AM GMTమరో ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివిధ ఆర్థిక సంస్థలకు దాదాపు రు.650 కోట్ల మేరకు బకాయి పడిన షిర్డి ఇండిస్టీస్ సంస్థ వ్యవస్థాపకుడు రాకేష్ అగర్వాల్ కు కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయెల్ - ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధ బాంధవ్యాలున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థకు పీయూష్ గోయెల్ 2010 వరకూ డైరెక్టర్ గా వ్యవహరించారు. గోయెల్ భార్యకు చెందిన ఇంటర్ కాన్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అగర్వాల్ సారధ్యం లోని షిర్డీ ఎంటర్ ప్రైసెస్ సంస్థ రు.1.59 కోట్ల మేర ఎటువంటి హామీలేని రుణం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రుణాన్ని 'మిత్రధర్మం'గా తాము అందించినట్లు షిర్డీ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
పీయూష్ గోయెల్ తనకు 1994 నుండి అత్యంత సన్నిహిత మిత్రుడని షిర్డీ సంస్థ ప్రమోటర్ రాకేష్ అగర్వాల్ తెలిపే వారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు గోయెల్ కుటుంబంతో తమ కుటుంబానికి కూడా సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన పేర్కొనట్లు వివరించింది. పీయూష్ గోయెల్ ఛైర్మన్ గా ఉన్న షిర్డీ సంస్థ 2010లో ఐపిఓకు వెళ్లింది. సెబి ఈ సంస్థను తన జాబితాలో చేర్చుకుంది కూడా. కాగా పియూష్ గోయెల్ ఈ సంస్థకు 2008 ఏప్రిల్ నుండి 2010 జులై వరకూ డైరెక్టర్ గా వ్యవహరించారన్న విషయం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2009 సెప్టెంబర్ 30 వరకూ హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గోయెల్ తరువాత ఆ పదవికి రాజీనామా చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 2010లో ఐపిఓకు వెళ్లిన షిర్డీ సంస్థ ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉందని, అప్పులను కూడా తీర్చేందుకు వనరులను వెదుక్కుంటోందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ తన ఆర్థిక హామీలను నెరవేర్చటంలో విఫలమయిందంటూ క్రిసల్ తన నివేదికలో పేర్కొన్న విషయం గమనార్హం.
మరోవైపు పీయూష్ గోయెల్ భార్య సీమా గోయెల్‌కు చెందిన ఇంటర్ కాన్ అడ్వైజర్స్ సంస్థకు షిర్టీ సంస్థకు చెందిన ఆసిస్ ఇండిస్టీస్ 2016లో రు.1.59 కోట్ల హామీలేని రుణాన్ని అందించినట్లు అధికారిక పత్రాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు దివాలా తీయటానికి ఈ రుణం ఇవ్వటానికి ఎటువంటి సంబంధమూ లేదని షిర్డీ సంస్థ ప్రమోటర్ రాకేష్ అగర్వాల్ వాదిస్తున్నారు. ఈ హామీ లేని రుణాన్ని తాము కొన్నేళ్ల కిందటే ఇచ్చామని, అప్పట్లో తమ వద్ద నిధులు పుష్కలంగా వుండటంతో మిత్ర ధర్మం మేరకు గోయెల్ భార్యకు ఈ రుణాన్ని ఇచ్చామని ఆయన వివరించారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో పీయూష్ గోయెల్ నుండి అందాల్సిన సమాచారం జవాబులభించని ప్రశ్నగానే మిగిలిపోయింది.
మరోవైపు రైల్వే మంత్రి పీయూష్ గో యల్ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. రూ.650 కోట్ల కుంభకోణానికి పాల్పడిన షిరిడీకి చెందిన ఓ కంపెనీతో పీయూష్ గోయల్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ మోసాన్ని షిరిడీ కా చమత్కార్(షిరిడీ కంపెనీ మాయ) అని అభివర్ణించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేస్తూ ``మొన్న బీజేపీ అధ్యక్షుడు అ మిత్ షా కుమారుడు జై షా అస్తులు అ మాంతం పెరిగాయి. నిన్న చోటా మోడీ(నీరవ్ మోడీ) బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోగా.. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కుమారుడికి చెంది ఓ సంస్థలోకి అక్రమంగా నిధులు పారాయి. నేడు షిరిడీ కా చమత్కార్(షిరిడీ కంపెనీ మాయ) మన కళ్ల ముందు కనిపిస్తోంది` అని పేర్కొన్నారు.