Begin typing your search above and press return to search.
అంతా అబద్ధం : ఇవిగో ప్రూఫులు - అయ్యన్న ఫ్యామిలీ
By: Tupaki Desk | 20 Jun 2022 7:39 AM GMTనర్సీపట్నం ఇష్యూలో భిన్న వాదనలు వినవస్తున్నాయి. ఎవరి వాదన వారు బలీయంగా వినిపిస్తూ, వాగ్వాదం కొనసాగిస్తు న్నారు. సీనియర్ లీడర్ కు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలిచి ఇవాళ ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం మినీమహానాడులో అయ్యన్న చేసిన వ్యాఖ్యల కారణంగానే తమను వేధిస్తున్నారని సంబంధిత వర్గాలు మరియు మాజీ మంత్రి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే సందర్భంలో హోం మంత్రి తానేటి వనిత స్పందించారు.
చట్ట ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. కారుమూరి నాగేశ్వరరావు అనే మరో మంత్రి కూడా అయ్యన్న ఇష్యూ పై స్పందించి ఎవ్వరైనా సరే చట్టానికి అతీతులు కారు అని చెప్పి, బీసీ అయినంత మాత్రాన తప్పు చేస్తే వదిలేయాలా అని మీడియా ముఖంగా ప్రశ్నించి వెళ్లారు.
అక్రమ కట్టడాలను తొలగించమని తాము నోటీసులు ఇచ్చామని నర్సీపట్నం మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం అంటోంది. కానీ తమకు అవేవీ అందలేదని చెబుతున్నారు బాధిత వర్గాలు అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు భార్య చింతకాయల పద్మావతి, ఆమె కుమారులు. ఇందులోఏది నిజం. ఏది అబద్ధం అన్నది దేవుడికే తెలియాలి అంటూ పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరవై రోజుల కిందటే తాము నోటీసులు ఇచ్చామని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
కానీ ఈ నోటీసులను అయ్యన్న వర్గాలు పట్టించుకోలేదని కూడా సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి, రాత్రివేళ గోడ కూల్చాల్సిన అవసరం ఏంటి అని నిలదీస్తున్నాయి బాధిత శ్రేణులు.
మరోవైపు వైసీపీ వాదన ఇంకో విధంగా ఉంది. జగన్ కు చెందిన అధికార పార్టీ మీడియాలో మాత్రం బాధితులు పోలీసులపై దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. గోడ తొలగించే క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై అయ్యన్న వర్గాలు దాడులు చేశాయని రాస్తోంది. చెబుతోంది కూడా ! వీటిని కూడా అయ్యన్న వర్గాలు ఖండిస్తున్నాయి.
గోడ తొలగింపు సమయంలో వాగ్వాదం నెలకొందని, ఎందుకంటే తాము డాక్యుమెంట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు అప్పటికప్పుడు సృష్టించినవి కాదని, వీటిని పోలీసులు పరిశీలించాలని కోరినా, తాము పదే పదే వేడుకున్నా వాటిని అధికార పార్టీ నాయకుల అండతో పట్టించుకోలేదని అయ్యన్న వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి రాజకీయంగా విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటనలు జరగడం మొదటి సారి అని టీడీపీ మండిపడుతోంది.తాము అన్ని అనుమతులూ తీసుకుని గోడ (ప్రహరీ) నిర్మించినా, అసలు నోటీసులే ఇవ్వకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేసి, రాత్రి వేళ గోడ కూల్చేయడం అన్యాయమని అయ్యన్న కొడుకులు రాజేశ్, విజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. తాము అన్ని అనుమతులు తీసుకున్న పత్రాలను కూడా వారు చూపిస్తున్నారు. తహశీల్దార్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకూ, అయ్యన్న కుటుంబ సభ్యులకూ వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఇక కూల్చివేతలపై టీడీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా చేశారని ఆరోపిస్తున్నారు.

ఇంకోవైపు అధికారులు మాత్రం తాము ఈ నెల రెండో తారీఖునే తాఖీదులు లేదా నోటీసులు ఇచ్చామని అంటున్నారు. ఇది కూడా వాస్తవం కాదని ఎందుకంటే తాము ఎటువంటి నోటీసులు అందుకోలేదని, విపక్ష పార్టీ తరఫున తన అమ్మ ప ద్మావతి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారని, కనీసం మాట మాత్రంగా కూడా ఆమెకు చెప్పకుండా, బ్యాక్ డేట్ తో నోటీసులు చూపించి, రాత్రికి రాత్రి గోడకు ఆ నోటీసులు అంటించి కూల్చేశారని వాపోతున్నారు.