Begin typing your search above and press return to search.
భూమా జగన్ వెంట లేరని కన్ఫర్మ్ గా చెప్పొచ్చు..?
By: Tupaki Desk | 21 Feb 2016 4:57 AM GMTగత మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఒకటే చర్చ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి.. ఆయన కుమార్తె అఖిల ప్రియ ఇద్దరూ సైకిల్ ఎక్కుతున్నారా? అన్న ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. ఒకపక్క కర్నూలు జిల్లాలో.. మరోపక్క ఏపీ రాజధాని విజయవాడలో.. ఇంకోపక్క హైదరాబాద్ లో ఇదే అంశంపై పలు పరిణామాలు శనివారం చోటు చేసుకున్నాయి. జగన్ సైకిల్ ఎక్కటం ఖాయమని టీడీపీ తమ్ముళ్లు తేల్చి చెబుతుంటే.. భూమా తమతోనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నొక్కి చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భూమా ఇష్యూలో నేరుగా ప్రభావితమయ్యే చంద్రబాబు.. జగన్ లు ఇద్దరూ ఓపెన్ గా ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యింది లేదు. అసలీ చర్చకు కారణమైన భూమా సైతం శనివారం మీడియాతో మాట్లాడింది లేదు. కానీ.. ఈ అంశం చుట్టూ చాలానే పరిణామాలు ఏర్పడటం గమనార్హం. ఇంతకీ భూమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారా? సైకిల్ ఎక్కుతున్నారా? అన్నది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఎవరికి వారు భూమా తమ వాడేనని చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇంతకీ.. భూమా ఎవరితో ఉన్నారు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించని పరిస్థితి.
అయితే.. శనివారం చోటు చేసుకున్న పరిణామాల్ని పరిశీలిస్తే.. జగన్ తో భూమా లేరన్న విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే. అలా ఎలా చెబుతారు? ఇదంతా మైండ్ గేమ్. కావాలనే అసత్యాలు చెబుతున్నారని పలువురు అనొచ్చు. కానీ.. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన పరిణామాలు చూస్తే.. జగన్ తో భూమా ఇంకేమాత్రం ఉండరని.. సైకిల్ ఎక్కేందుకు ఆయన తగిన ముహుర్తం ఖరారు చేసుకోవటమే మిగిలి ఉందన్న అభిప్రాయం కలగక మానదు.
జగన్ తో భూమా లేరని ఎలా చెప్పొచ్చంటే..?
= భూమా కానీ టీడీపీలో రాకుంటే.. ఆయన వైరి వర్గమైన శిల్పా సోదరులు.. కేఈతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ కావాల్సిన అవసరం ఏముంది?
= భూమా రాకతో.. జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అభయం ఎందుకిస్తారు?
= భూమా సంగతి మీకన్నా నాకే బాగా తెలుసు. ‘ఆ విషయాలన్నీ నేనే చూసుకుంటా’ అని చంద్రబాబు కర్నూలు టీడీపీ నేతలకు చెప్పరు కదా?
= భూమా జంపింగ్ కన్ఫర్మ్ కాకుంటే.. ఆయన ఇంటికి జగన్ పార్టీ పెద్దలు వెళ్లి చర్చించాల్సిన అవసరం ఉండదు కదా?
= ఒకవేళ భూమా పార్టీలోనే ఉంటే.. ఇంట్లో నుంచి బయటకొచ్చి అదే విషయాన్ని మీడియాకు క్లియర్ గా చెబుతారు కదా?
= భూమా ఇంటికి జగన్ పార్టీ పెద్దలు రాయబారానికి వెళితే.. ఇంటి బయట వరకు సాగనంపటానికి భూమా రాలెదెందుకు?
= కర్నూలుజిల్లా పార్టీ నేతలతో జగన్ మీటింగ్ పెడితే.. భూమా.. ఆయన కుమార్తె ఎందుకు హాజరు కానట్లు?
= భూమాతో నేరుగా మాట్లాడాలని జగన్ ఎంత ప్రయత్నించినా కుదరకపోవటం ఏమిటి?
= శనివారం ఒక్కరోజే.. జగన్ సన్నిహిత నేతలు రెండు దఫాలు భూమా ఇంటికి వెళ్లి చర్చలు జరపటం ఏమిటి?