Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ఇలాకాలో టీడీపీ దూకుడు... వైసీపీ బేజారేనా...!

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:30 PM GMT
మాజీ మంత్రి ఇలాకాలో టీడీపీ దూకుడు... వైసీపీ బేజారేనా...!
X
ఏ పార్టీ అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఇంటి పోరు వ‌స్తే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. గ‌తంలోనూ ఇలాంటి ప‌రిణామాలు ఎదురయ్యాయి. ఒకే ఇంట్లో రెండు కుంప‌ట్లు రాజేసిన నాయ‌కులు.. రెంటికీ చెడిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అర‌కు ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో తండ్రీ త‌న‌యలు పోటీ చేసి.. రెంటికీ చెడిపోయి.. ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీల్లోనూ ఇదే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా కీల‌క నాయ‌కుల విష‌యంలోనే ఇలా ఉండ‌డం ఇబ్బందిగా కూడా మారింది.

తాజాగా వైసీపీ కీల‌క నేత‌, సీఎం జ‌గ‌న్‌కుఅత్యంత మిత్రుడుగా గుర్తింపు తెచ్చుకున్న పెద్దిరెడ్డి శిష్యుడు బియ్య‌పు మ‌ధుసూదన్ రెడ్డి ఇంట్లో ర‌గ‌డ రాజ‌కీయ ర‌చ్చ‌కు దారితీసింది. ఈయ‌న బావ‌మ‌రిది.. సామాను శ్రీధ‌ర్‌రెడ్డి రోడ్డున ప‌డ్డారు. త‌న సొంత బావే.. త‌న‌కు అన్యాయం చేస్తున్నారంటూ మీడియా ముందుకు వ‌చ్చి ఏకంగా ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి ప్ర‌య‌త్నించారు. వెనుక ఏం జ‌రిగిందో ఎవ‌రికీ తెలియదు.. కానీ, ఎమ్మెల్యేపై మాత్రం వేధింపుల ముద్ర‌ప‌డింది.

వైసీపీలోనే మ‌రో ర‌గ‌డ‌.. కొడుకుకు మంత్రి ప‌దవి ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో వ‌సంత నాగేశ్వ‌ర‌రావు.. త‌న కుమారుడు, ఎమ్మెల్యే కృష్ణ‌ప్ర‌సాద్‌ను కాపాడుకునేందుకు.. వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎన్టీఆర్ పేరును తీసేస్తే.. క‌మ్మ వ‌ర్గం మౌనంగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిగా లేక‌పోతే.. రాష్ట్రానికి అరిష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. త‌ద్వారా.. ఆయ‌న సాధించింది ఏమో కానీ, పార్టీలో కేపీ ఇప్పుడు మైన‌స్ అయిపోయారు. పైగా ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గానికి ఆయుధాలు ఇచ్చిన‌ట్టు అయింది.

ఇక‌, టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. విజ‌య‌వాడ ఎంపీ నాని ఇంట్లోనే ఎగ‌స్పార్టీ రాజేశారు ఆయ‌న సోద‌రుడు శ్రీనాధ్‌. సొంత పార్టీలోనే వ్య‌తిరేక వ‌ర్గం ఆయ‌న ఇంట్లోనే తిష్ట‌వేయ‌డం.. ఆయ‌న‌ను వ్య‌తిరేకించే వారికి .. ఇదిఅందివ‌చ్చిన అవ‌కాశంగా మారింది. మేం ఓడించ‌క్క‌ర్లేదు.. ఆయ‌న త‌మ్ముడే ఆయ‌న‌ను ఓడిస్తారంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో గాలి బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య మ‌రోసారి క‌య్యాలు బయ‌ట ప‌డ్డాయి. నువ్వు టీడీపీ, నేను వైసీపీ అంటూ.. సోద‌రు ఇద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఈ రెండు పార్టీల్లోనూ నేత‌లు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.