Begin typing your search above and press return to search.

జీవీఎంసీ కౌన్సిల్‌ భేటీలో ఆస్తిపన్ను పెంపు రచ్చ .. విపక్షాల ఆందోళన !

By:  Tupaki Desk   |   23 Jun 2021 8:30 AM GMT
జీవీఎంసీ కౌన్సిల్‌ భేటీలో ఆస్తిపన్ను పెంపు రచ్చ .. విపక్షాల ఆందోళన  !
X
ఆంధ్రప్రదేశ్ లో 15 శాతం మేర ఆస్తిపన్ను పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే పలు చోట్ల విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు విశాఖఫట్నంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. నేడు జరుగుతున్న విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్ జీవీఎంసీ కౌన్సిల్‌ భేటీలో ఆస్తిపన్ను పెంపు రచ్చకు దారి తీసింది. ఆస్తిపన్ను పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతూ విపక్ష టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారు. మేయర్ గొలగాని హరికుమారి ఎంత నచ్చజెప్పినా వారు పట్టించుకోలేదు.

అధికార వైసీపీ కార్పోరేటర్లు కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనితో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో విపక్ష కార్పోరేటర్ల నిరసనతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది. చివరికి విపక్ష సభ్యుల్ని నచ్చజెప్పే పరిస్ధితి లేకపోవడంతో మేయర్ హరికుమారి తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు జీవీఎంసీ కౌన్సల్ బయట నిరసనలు తెలిపారు. తన ఛాంబర్‌ లో అన్ని పక్షాల ఫ్లోర్ లీటర్లలో చర్చలు జరుపుతున్నారు. ఆస్తిపన్ను పెంపు ప్రభుత్వ నిర్ణయం అని, దాన్ని అమలు చేయడం మాత్రమే కౌన్సిల్ బాధ్యత అని, దీన్ని అర్ధం చేసుకోవాలని విపక్షాలకు చెప్తున్నారు. కౌన్సిల్‌ భేటీని అజెండా మేరకు కొనసాగించేందుకు అన్ని పక్షాలు సహకరించాలని మేయర్ కోరుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఆస్తిపన్ను అమలైతే రాష్ట్రవ్యాప్తంగా రూ.156 కోట్లు మాత్రమే అదనంగా సమకూరుతుందని, టీడీపీ నేతలు అర్థరహితంగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘350 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఇంటికి రూ.50మాత్రమే ఇంటి పన్ను ఉంటుంది. దీనికంటే ఎక్కువ విధిస్తే అధికారులను నిలదీయాలని ప్రభుత్వం చెప్తుంది.