Begin typing your search above and press return to search.
బెజవాడలో మోడల్స్ తో పాడుపని
By: Tupaki Desk | 17 Oct 2015 12:07 PM GMTరాజధాని నగరానికి ఉండాల్సిన హంగు.. పొంగు బెజవాడకు రాకున్నా.. పాడుపనుల విషయంలో మాత్రం అప్పుడే నగరాల స్థాయిని చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ముంబయి నుంచి మోడల్స్ ను తీసుకొచ్చి హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
పేరుకు సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకునే ప్రముఖ హాస్యనటుడి బంధువు ఒకరు ముంబయి నుంచి మోడల్స్ ను తీసుకొచ్చి ఖరీదైన వ్యభిచారం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నున్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ లో ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీనిపై నిఘా పెట్టారు. ముంబయి.. చెన్నై నుంచి మోడల్స్ ను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. కాంట్రాక్ట్ పద్ధతి మీద ముంబయి.. చెన్నై నగరాల నుంచి తీసుకొస్తున్న మోడల్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గర్తించారు.
దీంతో.. పక్కాగా ప్లాన్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేయగా.. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే మొయినుద్దీన్ మహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. తాను వ్యభిచార నిర్వాహకుడ్ని కాదని.. తాను విటుడిగా సదరు వ్యక్తి చెప్పుకోవటం గమనార్హం. మరో విషయం ఏమిటంటే.. ప్రముఖ హాస్య నటుడి బంధువుగా చెప్పుకునే ఈ వ్యాపారికి.. సదరు నటుడికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇక.. ముంబయి నుంచి వచ్చిన మోడల్ ఒకరు మాట్లాడుతూ.. తనకు రోజుకు రూ.10వేలతో పాటు.. ఫ్లైట్ ఛార్జీలు.. బస ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ మీద బెజవాడకు వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. పైకి సెకండ్ హ్యండ్ కార్ల వ్యాపారం అని చెప్పి.. చివరకు చేసేది ఇదా అంటూ పోలీసులు నోరెళ్ల బెడుతున్నారు.