Begin typing your search above and press return to search.
దేశ వ్యాప్తంగా అల్లుకుంటున్న పౌరసత్వం మంటలు!
By: Tupaki Desk | 17 Dec 2019 1:30 AM GMTమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వం సవరణల చట్టంకు సంబంధించి నిరసనలు దేశ వ్యాప్తం అవుతున్నాయి. ఆ చట్టాన్ని నిరసిస్తూ రోడ్డెక్కే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. విద్యార్థుల ద్వారా ఈ ఉద్యమం తీవ్రం అవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఒకవైపు ఈ చట్టంపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మత ప్రాతిపదికన చేసిన చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టును పలువురు కోరారు. అయితే ఆ వ్యవహారాలు ఇంకా విచారణకు రాలేదు. అయితే దేశవ్యాప్తం గా నిరసన ప్రదర్శనలు మాత్రం గట్టిగా సాగుతూ ఉన్నాయి. అవి హింసాత్మకం అవుతుండటమే ఆందోళనకరం.
ఈ హింసాత్మక ఆందోళనలు కూడా మొదట ఈశాన్య రాష్ట్రాలకూ - అస్సాంకు పరిమితం అయ్యాయి. అవి కాస్తా.. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లాయి. అక్కడ కూడా ఆందోళన కారులు హింసాత్మకంగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఈ ఆందోళనలు దొమ్మీలుగా కూడా మారాయి.
పక్క దేశాలతో సరిహద్దులను పంచుకునే ప్రాంతాల్లోనే కాకుండా.. ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ ఆందోళనలు తీవ్రతరం కావడం గమనార్హం. యూపీలోని వివిధ నగరాల్లో ఈ పౌరసత్వ చట్టం సవరణలను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక దక్షిణాదిన కూడా సంఘీభావ ఆందోళనలు సాగుతున్నాయి. బెంగళూరులో పలువురు ఆందోళన కారులు శాంతీయుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు.