Begin typing your search above and press return to search.
పంజాబ్ లో లాల్ సింగ్ చడ్డాపై నిరసన
By: Tupaki Desk | 12 Aug 2022 4:10 AM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా'కు నిరసనల సెగ ఎదురవుతోంది. అమీర్ ఖాన్ హిందూ (దేశ) వ్యతిరేకి అన్న విమర్శల కారణంగా చాలా మంది నెటిజనులు ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ పైనా పంజాబ్ లో దాడి జరిగింది.
మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తెరకెక్కించారని ఆరోపిస్తూ జలంధర్ లో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని శివసేన హింద్ అనే ఆర్గనైజేషన్ ప్రయత్నించింది. అయితే సిక్కు తాల్-మెల్ కమిటీ అనే మరో బృందం మూవీని నిలువరించకుండా కాపాడేందుకు రావడం తో ఘర్షణ ఏర్పడింది. ఒక గ్రూప్ సినిమాని ఆపేందుకు వస్తే మరొక గ్రూప్ కాపాడేందుకు రావడం ఇక్కడ ఆశ్చర్యపరిచింది.
ముంబై మీడియా కథనాల ప్రకారం.. జలంధర్ లోని MBD మాల్ లోని PVR సినిమాస్ లో ప్రదర్శనను ఆపడానికి ప్రయత్నించిన శివసేన హింద్ నుండి వ్యతిరేకతను ఎదుర్కొంది. అమీర్ ఖాన్ ను హిందూ వ్యతిరేకిగా సంబోధిస్తూ థియేటర్ లో సినిమాను బహిష్కరించాలని ఫ్రింజ్ గ్రూప్ పిలుపునిచ్చింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లేఖ కూడా సమర్పించారు. అనంతరం డీసీపీకి లేఖ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు సిక్కు తాల్-మేల్ కమిటీ కి 'శివసేన హింద్' చర్యలను వ్యతిరేకించిన చరిత్రను కలిగి ఉంది. ఫ్రింజ్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందుకున్న ఈ కమిటీ సభ్యులు లాల్ సింగ్ చడ్డా ఆడుతున్న మాల్ కు చేరుకున్నారు. అక్కడ వారు సినిమాను బహిష్కరించేది లేదని థియేటర్లలో ప్రదర్శనను ఆపడానికి ఎవరినీ అనుమతించబోమని తేల్చి చెప్పారు.
కొన్ని వారాల క్రితం 'బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా' సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. నెటిజనులు అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ దేశ వ్యతిరేక ప్రకటనలు చేశారని ఆరోపించారు. అయితే అమీర్ ఖాన్ సినిమా ఈవెంట్ లలో ఈ సమస్య గురించి ప్రస్తావించారు. ప్రజలు తనను దేశ వ్యతిరేకిగా భావించడంపై విచారం వ్యక్తం చేశారు.
ఈ చిత్రం 'ఫారెస్ట్ గంప్'కి అధికారిక హిందీ రీమేక్.. నాగ చైతన్య హిందీ అరంగేట్రం చిత్రం కూడా. అక్షయ్ నటించిన రక్షా బంధన్ తో పోటీపడుతూ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న విడుదలైంది. అయితే లాల్ సింగ్ కి మిశ్రమ స్పందనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.