Begin typing your search above and press return to search.

పాక్ పై రగిలిపోతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్!

By:  Tupaki Desk   |   2 Oct 2016 11:04 AM GMT
పాక్ పై రగిలిపోతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్!
X
ఉడి ఉగ్రదాది, భారత్ సర్జికల్ స్ట్రైక్ అనంతర పరిణామాలతో పాకిస్థాన్‌ పై ఇప్పుడు ముప్పేట దాడి జ‌రుగుతోంది. ఒక అంత‌ర్జాతీయ స‌మాజంలో భార‌త్ వేసిన ఎత్తుతో ఇప్పటికే పాక్ ఒంట‌రైపోగా, మ‌రోవైపు మోడీ బ‌లూచిస్థాన్ అంశాన్ని లేవ‌నెత్త‌డంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఇప్పుడు పాకిస్థాన్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే) ప్ర‌జ‌లు కూడా పాకిస్థాన్ సైన్యం - ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అరాచ‌కాల‌పై తిరగ‌బ‌డుతున్నారు. వీధుల్లోకి వ‌చ్చి పాక్‌ జాతీయ పతాకాన్ని తగులబెడుతూ, పాక్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు.

"కశ్మీర్‌ ను ముక్కలు చేసిన కసాయి.. పాక్ ఆర్మీ", "క‌శ్మీరీల న‌ర‌హంత‌కులు పాకిస్థాన్ ఆర్మీ", "ఐఎస్‌ఐ కన్నా, కుక్కలు చాలా విధేయంగా ఉంటాయి" అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐఎస్ఐ కుట్ర ప‌న్ని, ఆయ‌న్ని హత్య చేసింద‌ని ఆందోళ‌న‌కారులు ఆరోపిస్తున్నా.. దీనిపై ఇప్ప‌టికీ ఇంకా విచార‌ణ మాత్రం ముగియ‌లేదు. దీంతో షాహిద్‌ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని వారు డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష జాతీయ కూటమి (ఏపీఎన్‌ఏ) చైర్మన్‌, జమ్మూకశ్మీర్‌ జాతీయ విముక్తి కాన్ఫరెన్స్‌ (జేకేఎన్‌ఎల్సీ) అధ్యక్షుడు అయిన 60 ఏళ్ల షాహిద్‌ 2013 మే 14న రావాల్పిండిలో తన ఇంటి ఎదుట హత్యకు గురయ్యారు. పీవోకేలో పాక్‌ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనను పాక్ సైన్యం, ఐఎస్‌ఐ కుట్రపూరితంగా చంపిందని ఆరోపణలు ఉన్నాయి.

కాగా, పీవోకేలో జ‌రుగుతున్న మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌పై అమెరికా కూడా తాజాగా ఆందోళ‌న వ్యక్తం చేయడంతో ఇప్ప‌టికే ముప్పేట దాడితో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న పాకిస్థాన్‌.. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్ర‌జ‌ల ఎదురుదాడితో మ‌రింత ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/