Begin typing your search above and press return to search.
జానీమూన్ వర్సెస్ తెలుగు తమ్ముళ్లు
By: Tupaki Desk | 7 Jan 2017 10:05 AM GMTపరిపాలన ప్రజలకు చేరువ అయ్యేందుకు - పనిలో పనిగా తెలుగుదేశం పార్టీకి పరోక్ష ప్రచారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టి జన్మభూమి గ్రామసభల్లో ఐదోరోజు సైతం నిరసనలు-నిలదీతల పర్వం కొనసాగింది. ఏకంగా మంత్రులు - ఎమ్మెల్యేలు - జెడ్పీ చైర్ పర్సన్ల సమక్షంలోనే కుర్చీలు విసురుకునే వరకు పరిస్థితి సాగింది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే గ్రూపులుగా విడిపోయి వాదోపవాదాలకు గారు. కొన్నిచోట్ల ప్రజలు తాము తాగుతున్న మురికి నీటిని మీరు తాగగలారా అంటూ ఎమ్మెల్యేలను నిలదీశారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలో జెడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ ఎదుటే తెలుగు తమ్ముళ్లు ముష్టియుద్ధానికి దిగారు. జెడ్ పీ ఛైర్ పర్సన్ జానీమూన్ మాట్లాడుతుండగా కొందరొచ్చి ప్రసంగం ఆపాలని డిమాండ్ చేశారు. మరికొందరు తెలుగు తమ్ముళ్లు మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వివాదం చివరికి కుర్చీలు విసిరేసుకునే వరకూ వెళ్లింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఎవరికివారు సర్దుకున్నారు. ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లిలో జరిగిన సభలో తమ భూములకు నష్టపరిహారం ఇవ్వలేదని - రేషన్ - పింఛను అందించడంలేదని పలువురు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి - వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో అధికార పార్టీలోని గ్రూపులే బాహాబాహీకి దిగాయి. సమస్యలు పరిష్కారం కాని సభలు ఎందుకని తూర్పు గోదావరి మన్యంలో గిరిజనులు జన్మభూమిని బహిష్కరించారు. సమస్యలను పరిష్కరించాలని నిలదీసిన గ్రామస్తులపై నాయకులపై కేసులు పెట్టటాన్ని కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో తప్పు పట్టారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ప్రజలు ప్రజా ప్రతినిధులను - అధికారులను నిలదీశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో నాలుగు కేజీలు కోత విధిస్తుండటంపై శ్రీకాకుళం రూరల్ మండలం అలికాంలో అధికారులను రైతులు నిలదీశారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడలో పింఛన్లు - రేషన్ కార్డులు - మరుగుదొడ్ల సమస్యలపై మంత్రి కిమిడి మృణాళినిని - ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడును గ్రామస్తులు నిలదీశారు. కొమరాడ మండలం పాలెం పంచాయతీ రావికోనలో రోడ్డు సమస్య పరిష్కరించాలని అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. కురుపాం మండలం మొండెంఖల్ లో అర్హులకు ఇళ్లు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై విశాఖ జిల్లా ముంచంపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నీటిని మీరు తాగుతారా? అని బిందెలతో తీసుకువచ్చిన బురదనీటిని ఎమ్మెల్యేకు చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే - సీపీఎం నాయకులపై వాగ్వాదానికి దిగారు. తమ సమస్యలపై మాట్లాడనివ్వనందుకు నిరసనగా పాడేరు మండలం బడిమెలలో గిరిజనులు పంచాయతీ కుర్చీలను విరగ్గొట్టారు. విశాఖ నగర పరిధిలోని పంచగ్రామాల భూసమస్య పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమైక్య ప్రజా - రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన పలు కాలనీల బాధితులు సింహాచలం గ్రామసభలో నిలదీశారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై కొందరు నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దర్శి మండలం లంకోజనపల్లిలో వైసీపీ - టీడీపీ నాయకుల మధ్య చెరువు భూముల ఆక్రమణలపై కొద్దిసేపు తోపులాట జరిగింది. లింగమసముద్రం మండలం ముత్యాలపాడులో అధికార పార్టీలోని రెండు గ్రూపుల మధ్యా మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. కొండేపల్లిలో సమస్యలపై అధికారులను గంటసేపు రోడ్డుపైనే అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చాగిబండలో ఎనిమిది నెలలుగా తాగునీరు రావడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ప్రజలు నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/