Begin typing your search above and press return to search.

మంత్రికి సొంత పార్టీ నుండే నిరసన..ఏమైందంటే !

By:  Tupaki Desk   |   14 Oct 2021 12:30 PM GMT
మంత్రికి సొంత పార్టీ నుండే నిరసన..ఏమైందంటే !
X
తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాయుడుపాలెంలో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కన్నబాబుకు సొంతపార్టీ నేతల నుండే చేదు అనుభవం ఎదురయింది. తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాయుడుపాలెంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కన్నబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అడ్డుకున్నారు. దేవాల‌యం విషయంలో బీసీ వర్గానికి కాకుండా కాపు వర్గానికి మంత్రి పెద్ద‌పీట వేస్తున్నారంటూ బీసీ నాయకులు వ్యతిరేకించారు.

తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి వేరే సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతోపాటు నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డంతో మంత్రి కన్నబాబు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. సొంత జిల్లాలోనే కన్న‌బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తుండ‌టాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని, ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌కానీ, వ్య‌క్తిగ‌తంగాకానీ ఆయ‌న చేస్తున్న త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల‌ని, లేదంటే రాబోయే ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిస్తామ‌ని సొంత‌పార్టీ నేత‌లే హెచ్చ‌రిస్తున్నారు. దీన్ని ఎలా స‌రిదిద్దుతార‌నేది క‌న్న‌బాబు వ్య‌వ‌హార‌శైలిపై ఆధార‌ప‌డివుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. క‌న్న‌బాబుపై సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డం ఇదే తొలిసారికాదు. గ‌తంలో కూడా ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి.