Begin typing your search above and press return to search.
'జాతీయగీతం అరెస్టు' ల రచ్చ మొదలైంది
By: Tupaki Desk | 14 Dec 2016 7:03 AM GMTథియోటర్లలో సినిమా ప్రారంభమయ్యే సమయంలో జాతీయ గీతాన్ని గౌరవించలేదనే ఆరోపణలపై అరెస్టులు చేయడంపై నిరసనలు మొదలవుతున్నాయి.కేరళలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా సినిమా థియేటర్ లో జాతీయ గీతాలాపన జరుగుతుండగా నిలబడకుండా అగౌరవపర్చారని రెండు వేర్వేరుచోట్ల 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై విడుదలైన అనంతరం వారు ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రధాన కేంద్రమైన ఠాగూర్ థియేటర్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో చేపట్టిన ఈ నిరసనలో వారు తమ వాదన వినిపిస్తూ...."జాతీయ గీతం డిజిటల్ పాట కాదు. జాతీయ జెండా ఆడియో విజువల్ కాదు. సినిమా అనేది ప్రాథమిక వినోదం. వినోదాన్ని విక్రయించే స్థలం సినిమా థియేటర్" అని అన్నారు. జాతీయ గీతం స్థాయిని తగ్గించవద్దని కోరారు. "మేము భారత్ ను ప్రేమిస్తున్నాం. జాతీయవాదాన్ని బలవంతంగా రుద్దవద్దు" అని ప్లకార్డులు చేతపట్టుకొని ఆందోళనకారులు నిరసన తెలిపారు. కాగా, జాతీయ గీతాలాపన జరుగుతుండగా నిలబడనందుకు 48 గంటల్లో వేర్వేరు ప్రాంతాల్లో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలాఉండగా..చెన్నై అశోక్ నగర్ లోని కాశీ థియేటర్ లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించగా ఇదే తరహాలో వివాదం రేగింది. సినిమాకు వచ్చిన వారిలో ఇద్దరు యువతులతోపాటు ఆరుగురు యువకులు లేచి నిలబడకపోగా - సెల్ఫీలు తీసుకుంటూ ఉండిపోవడంపై ఫిర్యాదులు రావడం, అనంతరం ప్రేక్షకుల మధ్య గొడవ కావడంతో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/