Begin typing your search above and press return to search.
బంగ్లాదేశ్ లో మోదీకి నిరసన సెగ..!!
By: Tupaki Desk | 27 March 2021 5:10 AM GMTబంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో తాను కూడా పాల్గొన్నానని ప్రధాని నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి అర్ధశతాబ్ధం పూర్తయిన సందర్భంగా .. ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ కు వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే కొందరు నిరసనకారులు మాత్రం మోదీ పర్యటనను వ్యతిరేకించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో సుమారు నలుగురు మరణించారు.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి విడిపోయేందుకు బంగ్లాదేశ్ సుధీర్ఘ, వీరోచిత పోరాటం చేసిందని .. ఆపోరాటానికి భారత్ కూడా మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాక బంగ్లాదేశ్ కు మద్దతుగా తాను కూడా స్నేహితులతో కలిసి సత్యాగ్రహం చేశానని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనను జైల్లో పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే మోదీ పర్యటనకు బంగ్లాదేశ్ లోని కొందరు ఆందోళనకారుల నుంచి నిరసన ఎదురైంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్లారు. ఆయనకు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. అనంతరం నరేంద్రమోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1971లో తూర్పు పాకిస్థాన్ గా ఉన్న బంగ్లాదేశ్ .. పాకిస్థాన్ నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే. ఈ విముక్తి పోరాటానికి భారత్ ఎంతో సహకరించింది. నరేంద్రమోదీ ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. బంగ్లాదేశ్ పోరాటానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
బంగ్లాదేశ్ కు ఎప్పటికి భారత్ అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. అయితే మోదీ పర్యటనను ఆ దేశంలోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నది. అందుకు గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. మోదీ పర్యటనను నిరసిస్తూ వాళ్లు ఆందోళన చేపట్టారు. నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చింది. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ కొందరు చిట్టగాంగ్ నగరంలో ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో నలుగురు ఆందోళనకారులు మరణించారని అక్కడి అధికారులు తెలిపారు.
'ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో మేము వారిని చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపాం' అని స్థానిక పోలీసు అధికారి రఫీకుల్ ఇస్లాం మీడియాకు తెలిపారు. మరోవైపు ప్రధాని పర్యటిస్తున్న ఢాకాలోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.