Begin typing your search above and press return to search.
మోడీకి పోస్ట్ కార్డులు, రాఖీలు, రక్తం
By: Tupaki Desk | 22 Aug 2016 10:07 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంలో నిరసన కొత్త రూపం దాల్చుతోంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీల వినతి పత్రాలు -ఆందోళనలకే పరిమితమైన ఈ అంశం ఇపుడు ప్రజలు కీలక భాగస్వామ్యం పంచుకునే స్థాయికి చేరింది. మహిళలు - విద్యార్థులు అని తేడాలేకుండా విభిన్న రూపాల్లో తమ ఆకాంక్షను వినిపిస్తున్నారు. ఇందుకోసం రాఖీలు కట్టడం - రక్తం చిందించడం - ఉత్తరాలు రాయడం వంటి విభిన్న మార్గాలను ఎంచుకున్నారు.
ఏపీకి స్పెషల్ స్టేటస్ కట్టబెట్టాలని కోరుతూ అనంతపురం జేఎన్ టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడికి పోస్టు కార్డు ద్వారా విభజనచట్టంలో ఇచ్చిన హమీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. జెఎన్ టియు ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరణ జరగడం వల్ల ప్రస్తుతం రాజధాని లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందన్నారు. ముఖ్యంగా రాయలసీమ బాగా వెనుకబడిందని అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రికి పోస్టుకార్డు ద్వారా తమ నిరసనను తెలుపుతున్నట్టు వివరించారు.
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించిన ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తమ ఆందోళనను కొత్త రూపంలో తెలిపేందుకు ప్రధాని మోడీకి రక్తం బాటిల్స్ పంపించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.ఈ నెల ముప్పైన వివిధ వర్గాల ప్రజలతో రక్తశిబిరం నిర్వహించి - ఆ రక్తం బాటిళ్లను ప్రదాని మోడీకి పంపుతామని ఆయన చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకుడు కొణతాల రామకృష్ణ రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు - విద్యార్థినులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహానికి రాఖీ కట్టించారు. సోదరభావంతో ఏపీకి స్పెషల్ స్టేటస్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తంగా ప్రధానమంత్రికి ఆంధ్రులు తమ ఆకాంక్షలు భలే కొత్తగా విన్నవిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.