Begin typing your search above and press return to search.

తంబీలు ఇంకా రగిలిపోతున్నారు

By:  Tupaki Desk   |   9 April 2015 5:30 PM GMT
తంబీలు ఇంకా రగిలిపోతున్నారు
X
శేషాచల అడవుల్లో ఏపీ అటవీ శాఖ అధికారులు.. పోలీసులు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇరవై మంది మృతి చెందటం.. వారంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావటం తెలిసిందే. ఈ వ్యవహారంపై తమిళనాడు అధికారపక్షంతో సహా.. తమిళ రాజకీయ పార్టీలన్నీ రగిలిపోతున్నాయి. ఇప్పటికే విమర్శలు.. ఆరోపణలు.. ఫిర్యాదులు చేయం తెలిసిందే.

అదే సమయంలో ఆంధ్రా వ్యతిరేకత వ్యక్తం కావటం.. ఆంధ్రా ఆస్తుల మీద దాడులు జరిపే ధోరణి మొదలైంది. ఎన్‌కౌంటర్‌ జరిగి మూడు రోజులు అవుతున్నా తమిళనాడులో మాత్రం దీనికి సంబంధించిన ఆందోళన మాత్రం తగ్గుముఖం పట్టలేదు.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో ఎక్కువగా వేలూరు.. తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారు. ఆ జిల్లాల్లో తెలుగు వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వేలూరులో టీటీడీ సమాచార కేంద్రంపై దాడి జరిగింది. మరోవైపు ఏపీ వైపు వచ్చే బస్సుల్ని గత మూడు రోజులుగా నిలిపివేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో మూడు రోజులపాటు బస్సులు తిరిగే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

తాజాగా పలు ప్రాంతాల్లో తమిళులు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. గురువారం ఏపీకి చెందిన 200 బస్సులు బంద్‌ అయ్యాయి. ఏపీకి చెందిన వారి సంస్థల వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌ లో తమిళ సంఘాలు రైల్‌రోకోను నిర్వహించాయి. మద్రాస్‌ హైకోర్టు ముందు న్యాయవాద సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఇక.. ఆందోళనలో మరో ముందడుగు వేసిన కొందరు ఆందోళకారులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబమ్మను తగలబెట్టారు. ఇప్పటికే తమిళనాడులోని ఆంధ్రాబ్యాంకుపై దాడి చేయటం తెలిసిందే. ఈ ఘటనల దృష్ట్యా తమిళనాడు సర్కారు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆస్తుల దగ్గర భద్రతను మరింత పెంచారు.