Begin typing your search above and press return to search.
చెప్పులు విసిరిన టేపులు వెతుకుతా!
By: Tupaki Desk | 9 March 2019 6:44 AM GMTలక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు దగ్గరవుతున్న నేపధ్యంలో అందులో చూపించినవన్నీ వాస్తవాలే అని చెప్పేందుకు వర్మ కన్నా ఎక్కువ అందులో నటించని యాక్టర్స్ ముందుకు రావడం విశేషం. ముఖ్యంగా 30 ఇయర్స్ పృథ్వి బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద దురభిమానులు చెప్పులు విసిరినప్పుడు తాను సిటి కేబుల్ ప్రోగ్రాం ఆపరేటర్ అక్కడే ఉన్నానని అదంతా ప్రత్యక్షంగా చూశానని వర్మ చూపించిన దాంట్లో ఏ అబద్దమూ లేదని స్టేజి మీద చెప్పేశాడు.
ఇది గతంలో ఓ ప్రైవేటు ఛానల్ మీడియా మైకు ముందు చెప్పిన పృథ్వి ఇప్పుడు పబ్లిక్ లో ఓపెన్ అయిపోయాడు. ఇప్పటిలా అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదు కాబట్టి వీడియోలు ఏవైనా క్యాసెట్ల రూపంలో భద్రపరిచె వారు. ఇప్పుడు పృథ్వి వీలైతే ఆ టేపులు వెతకి జనం ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. అయినా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు మొదలైంది కాదు. నిజంగా పృథ్వికి ఆ వీడియో చూపించాలని ఉంటే ఎప్పుడో మొదలుపెట్టి ఈ పాటికి వాటిని సంపాదించి ఉండొచ్చు. ఇంకో రెండు వారాల్లో విడుదల పెట్టుకుని అ టేపులు తెచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం కన్విన్సింగ్ గా తీసుకోలేం.
నిజంగానే ఎవరో ఒకటి రెండు మీడియా సంస్థల వద్ద మాత్రమే ఆ వీడియోలో అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. ఇరవై ఏళ్ళనాటి ఆ వీడియోలు బయటికి తీయడం అంటే ఆల్మోస్ట్ జరగని పనే. అయితే పృథ్వి చెప్పిన సిటి కేబుల్ ఆపరేటర్ కథ నిజమే అయ్యుండొచ్చు. ప్రేక్షకుల్లో అసలు వైస్రాయ్ హోటల్ వద్ద ఏం జరిగింది అనే ఎపిసోడ్ మీదే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. పృథ్వి దీని గురించి నొక్కి వక్కాణించడంతో మరోసారి ఈ టాపిక్ హై లైట్ అయ్యింది