Begin typing your search above and press return to search.

బాబుకు నోట మాట రాని రీతిలో పృధ్వీ పంచ్ !

By:  Tupaki Desk   |   2 Jun 2019 4:56 AM GMT
బాబుకు నోట మాట రాని రీతిలో పృధ్వీ పంచ్ !
X
అదే ప‌నిగా మాట‌లు చెప్ప‌టం కాదు.. అందులో అంతో ఇంతో అర్థం ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అలాంటివేమీ ప‌ట్టించుకోకుండా మాట‌ల‌తో కాల‌క్షేపం చేసే చంద్ర‌బాబు లాంటోళ్ల‌కు థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వీ లాంటోళ్లు వేసే ప్ర‌శ్న‌లు దిమ్మ తిర‌గ‌ట‌మేకాదు.. నోట మాట రాకుండా చేస్తాయి. తాజాగా అలాంటి ప‌రిస్థితే ఒక‌టి ఏర్ప‌డింది.

మాట ఏదైనా స‌రే.. సుత్తి కొట్ట‌కుండా సూటిగా చెప్పే త‌త్త్వం థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ పృథ్వీలో కాస్త ఎక్కువే. చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల్ని అదే ప‌నిగా చెప్పే ఆయ‌న‌.. తాజాగా ఒక కీల‌క వ్యాఖ్య చేశారు. ఆంధ్రాను అంత అభివృద్ధి చేశాను.. ఇంత డెవ‌ల‌ప్ చేశాన‌ని చెబుతుంటారు క‌దా? ఆంధ్రాలో అన్ని ఆసుప‌త్రులు ఉంటే తెలంగాణ‌కు వ‌చ్చి బాకీ చెక‌ప్ చేయించుకోవ‌టం ఏమిటి? అని ప్ర‌శ్నించారు.

ఇదే ప‌ని జ‌గ‌న్ చేసి ఉంటే నిల‌దీసే వారు క‌దా? అంటూ ప్ర‌శ్నించారు. థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ మాట‌ల్లో లాజిక్ మీద ఇప్పుడు ప‌లువురు రియాక్ట్ అవుతున్నారు. ఆంధ్రాలో అడుగ‌డుకు ఒక ఆసుప‌త్రి ఉన్న‌ప్పుడు.. అన్నింటిని వ‌దిలి బాబు హైద‌రాబాద్ కే ఎందుకు వ‌చ్చిన‌ట్లు? అన్న ప్ర‌శ్న సంగ‌తి ఎలా ఉన్నా.. హైద‌రాబాద్ లోని ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ ఆసుప‌త్రి చాలా ఫేమ‌స్‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ ఆసుప‌త్రికి వ‌స్తుంటారు. ఈ రంగానికి సంబంధించి దీనికి మించిన ఆసుప‌త్రి మ‌రేదీ లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ కార‌ణంతోనే చంద్ర‌బాబు వ‌చ్చేసి ఉండొచ్చు. తెలుగు త‌మ్ముళ్ల నోటి నుంచి ఏ మాట అయితే వ‌స్తుందో.. అదే త‌ర‌హా మాట మాట్లాడితే ఎలా ఉంటుంద‌ని చెప్ప‌టానికి పృథ్వీ ఎపిసోడ్ ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. తెలుగు త‌మ్ముళ్లు జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌టానికి ఎప్పుడూ.. రెడ్ల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తుంటారు జ‌గ‌న్ అంటారు. తాజాగా చంద్ర‌బాబు వెళ్లిన డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి కూడా.. రెడ్డి సామాజిక వ‌ర్గ‌మే. మ‌రి.. దీనికేమంటారు? అందుకే అన్ని సంద‌ర్భాల్లో ఒకే పోలిక పోల‌వ‌టం బాగోద‌న్న విష‌యం బాబుకు ఇప్ప‌టికైనా అర్థ‌మ‌వుతుంది? బాబును టార్గెట్ చేసేందుకు థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రి.. ఆయ‌న క‌ష్టానికి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో..?