Begin typing your search above and press return to search.
2019లో జగన్ విల్ బీ బ్యాక్:పృధ్వి
By: Tupaki Desk | 4 Aug 2018 11:39 AM GMTటాలీవుడ్ స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ కొద్ది కాలం క్రితమే వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ను పృధ్వి ఇప్పటికే రెండు సార్లు కలిసి జననేతకు మద్దతు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తప్పక గెలుస్తుందని, ఢిల్లీలో ఆప్ తరహాలో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీదే గెలుపని - జగన్ సీఎం అవుతారని - కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని పృథ్వి బల్లగుద్ది మరీ పలుమార్లు చెప్పారు. తాజాగా, ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పృధ్వి మరోసారి వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని - వైసీపీ 120-130 స్థానాలు కైవసం చేసుకుంటుందని పృధ్వి జోస్యం చెప్పారు. జగన్ గారు విల్ బీ బ్యాక్...అంటూ తనదైన శైలిలో పృధ్వి పంచ్ డైలాగ్ పేల్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలపై ట్రోలింగ్ విపరీతంగా జరగుతోందని - మహిళలకు రక్షణ కరువైందని....మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు పృధ్వి ఆసక్తికర సమాధానమిచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇటువంటివి జరగవని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో మహిళలపై అన్యాయాలు అక్రమాలు జరగవని...వారికి పూర్తి రక్షణ నిస్తామని.....తమ నాయకుడు జగన్ ఎజెండా ఇదేనని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ...వైసీపీ చరిత్ర సృష్టించబోతోందని.....2019లో వైసీపీకి 120-130 సీట్లు వస్తాయని అన్నారు. జగన్ గారు విల్ బీ బ్యాక్...అని...ప్రజలందరూ వైసీపీ కి మద్దతివ్వాలని పృధ్వీ పిలుపునిచ్చారు. మరోవైపు, ఇండస్ట్రీకి ఒక పెద్ద ఉండాలి....ఆర్టిస్టులు తమ సమస్యలన్నీ చెప్పుకునేందుకు పెద్ద దిక్కు కావాలని అన్నారు. అలా లేకపోవడం వల్లే కొందరు మీడియా ముందుకు వెళుతున్నారని అభిప్రాయపడ్డారు. సినీ ఆర్టిస్టులకు గుర్తింపు ఎక్కువన్న మాట వాస్తవనమి...అయితే, జనం....మనల్నే ఆరాధిస్తున్నారనే ధోరణిని సినీ ఆర్టిస్టులు వదిలేయాలని....పృధ్వీ అన్నారు. ఇపుడున్న సమాజాన్ని హార్పిక్ లాంటిది పెట్టి క్లీన్ చేయాలని అన్నారు.