Begin typing your search above and press return to search.
కీరవాణి, సునీత లాంటి వాళ్ల అవసరం లేదు
By: Tupaki Desk | 6 Oct 2019 12:15 PM GMTతిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానెల్ ఎస్వీబీసీకి చైర్మన్ గా పనిచేస్తున్న నటుడు ఫృథ్వీ తాజాగా హాట్ కామెంట్ చేశారు. ఎస్వీబీసీలో పాటలు పడడం.. వివిధ ప్రోగ్రాముల్లో పాల్గొనడానికి రూ.2లక్షలు ఇవ్వమని టాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు కీరవాణి, సునీత లాంటి వాళ్లు అవసరం లేదని.. స్థానికంగా చాలా మంది అద్భుతమైన గాయకులు ఉన్నారని ఫృథ్వీ స్పష్టం చేశారు. స్థానిక కళాకారులతోనే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. నెలలో 20 రోజులు ఇక్కడే ఉండి స్వామికి సేవ చేస్తానని స్పష్టం చేశారు.
రాఘవేంద్రరావుకు గడ్డం ఉంటుంది.. నాకు ఉండదు అదే తేడా అని ఫృథ్వీ చెప్పుకొచ్చాడు. మాజీ ఎస్వీబీసీ చైర్మన్ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రస్తుత ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీ ఈ కామెంట్ చేశారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉందని.. ఎస్వీబీసీలోని ఉద్యోగులకు భద్రత, సౌకర్యాలు, సరికొత్త టెక్నాలజీతో చానెల్ రూపురేఖలు మారుస్తానని స్పష్టం చేశారు.
తాను ఒక్క రోజు షూటింగ్ చేస్తే 30 లక్షలు సంపాదించేవాడనని.. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎస్వీబీసీలో సేవ చేస్తున్నానని ఫృథ్వీ అన్నారు. టీటీడీ వాహనాలు కూడా వాడడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎస్వీబీసీలో గతంలో జరిగిన అక్రమాలపై సీఎం కార్యాలయానికి ఫైల్ పంపిస్తానని ఫృథ్వీ అన్నారు.