Begin typing your search above and press return to search.

న‌న్ను ఒక‌ చెత్త ఆటగాడని అన్నారుః టీమిండియా ఓపెన‌ర్

By:  Tupaki Desk   |   13 March 2021 5:10 AM GMT
న‌న్ను ఒక‌ చెత్త ఆటగాడని అన్నారుః టీమిండియా ఓపెన‌ర్
X
ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా గురించి చ‌ర్చించాలంటే.. ఐపీఎల్ కు ముందు ఆ త‌ర్వాత అని మాట్లాడుకోవాలేమో! వంద కోట్ల‌మంది ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ద‌కొండు మంది స‌రైన ఆట‌గాళ్లు కూడా దొర‌క‌ట్లేదా? అని అభిమానులు పెద‌వి విరిచేవారు. సెల‌క్ష‌న్‌ రాజ‌కీయాలపైనా మండిప‌డేవారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఐపీఎల్ తో నాణ్య‌మైన ఆట‌గాళ్లు వెలుగులోకి వ‌స్తున్నారు. అలాంటి వారిలో ఒక‌రైన యువ ఆట‌గాడు పృథ్వీ షా.

రంజీల్లో ముంబై కెప్టెన్ గా ఉన్న షా.. ఇటీవ‌ల ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో మొద‌టి టెస్టులో విఫ‌ల‌మ‌య్యాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో డ‌కౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు. దీంతో.. మిగిలిన టెస్టుల్లో ఛాన్స్ రాలేదు. ఆ స‌మ‌యంలో త‌న ప‌రిస్థితి ఎలా ఉందో తాజాగా వివ‌రించాడు పృథ్వీ. ప్ర‌స్తుతం విజ‌య్ హ‌జారే రంజీ టోర్నీలో స‌త్తాచాటుతున్నాడు ఈ ఓపెన‌ర్‌. ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కూ అత్య‌ధిక‌ ప‌రుగులు (754 ) చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ సంద‌ర్భంగా నేష‌నల్ మీడియాతో మాట్లాడు షా.

తొలి టెస్టులో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసిన త‌ర్వాత డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి బాగా ఏడ్చాన‌ని చెప్పాడు. తాను ఎలా ఔట‌య్యాన‌ని, ఎందుకు ఔట‌య్యాన‌ని ఎన్నో సార్లు ఆలోచించిన‌ట్టు తెలిపాడు. ఈ ప‌ర్య‌ట‌న ద్వారా చాలా విష‌యాల‌ను నేర్చుకున్నానని అన్నాడు. బ్యాటింగ్ లోపాల‌ను స‌రిచేసుకున్న‌ట్టు చెప్పాడు. పృథ్వీ. అయితే.. తాను అంద‌రూ అనుకున్నంత చెత్త ఆట‌గాడిని కాద‌ని, తాను మేటి జ‌ట్టుతో ఆడాన‌ని స‌ర్దిచెప్పుకున్న‌ట్టు తెలిపాడు షా.

ఇప్పుడు విజ‌య్ హ‌జారే ట్రోపీలో త‌న ప్ర‌ద‌ర్శ‌న‌పై చాలా సంతోషంగా ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే టీమిండియాకు మ‌ళ్లీ ఆడ‌తాన‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. ఆస్ట్రేలియాలో విఫ‌ల‌మైన త‌ర్వాత‌.. ఇటీవ‌ల స్వ‌దేశంలో ఇంగ్లండ్ తో జ‌రిగిన సిరీస్ లోనూ షాకుచోటు ల‌భించ‌లేదు.