Begin typing your search above and press return to search.

PSLV–సీ50 ప్రయోగం సక్సెస్ !

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:00 PM GMT
PSLV–సీ50 ప్రయోగం సక్సెస్ !
X
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో మరో విజయం వచ్చి చేరింది. PSLV సిరీస్ విజయాల్లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టింది. PSLV–సీ50 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. PSLV–సీ50 రాకెట్‌ ద్వారా CMS-01 శాటిలైట్‌‌ను నింగిలోకి పంపింది. సీఎంఎస్‌-01 శాటిలైట్ ఏడేళ్లపాటు సేవలు అందించనుంది. అంతేకాదు, సీఎంఎస్‌-01 శాటిలైట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అలాగే, సీ బ్యాండ్ సేవల విస్తరణకు ఉపయోగపడనుంది.

1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్‌-01 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ను నింగిలోకి ఇస్రో పంపింది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్‌-12 స్థానాన్ని సీఎంఎస్‌-01 శాటిలైట్‌ భర్తీ చేయనుంది. షార్ నుంచి ఇది 77వ మిషన్ కాగా, PSLV సిరీస్‌లో ఇది 52వ ప్రయోగం. అలాగే, ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. PSLV – సీ50 ప్రయోగం విజయవంతం కావడంతో భారత సాంకేతిక వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.

PSLV సీ-50 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ హర్షం వ్యక‍్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్‌ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్‌ చెప్పారు. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత PSLV కే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి.