Begin typing your search above and press return to search.

ఇలాంటి వీడియో మీరెప్పుడూ చూసి ఉండ‌రు!

By:  Tupaki Desk   |   1 April 2019 12:39 PM GMT
ఇలాంటి వీడియో మీరెప్పుడూ చూసి ఉండ‌రు!
X
అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త పుణ్య‌మా అని.. కొన్ని అసాధ్య‌మైన‌వి సాధ్య‌మ‌వుతున్నాయి. తాజా ఉదంతం అలాంటిదే. ఒక రాకెట్ ప్ర‌యోగాన్ని.. ఆకాశంలో ఎత్తున‌.. మ‌రో విమానం నుంచి షూట్ చేయ‌టం సాధ్య‌మా? అంటే నో అనే చెప్పాలి. కానీ.. సెల్ ఫోన్ పుణ్య‌మా అని ఆ అద్భుతాన్ని రికార్డు చేశారో పైలెట్‌. మ‌రి.. ఇలాంటి అద్భుత‌మైన వీడియో అంద‌రితో పంచుకోవ‌టం మామూలుగా అయితే కుద‌ర‌దు. కానీ.. సోష‌ల్ మీడియా అనే అద్భుతం ఉండ‌టంతో అది సాధ్య‌మైంది.

అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త పుణ్య‌మా అని అరుదైన‌వి.. చూసేందుకు సాధ్యం కాని విష‌యాల్నిఈ రోజు అంద‌రూ చూస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ అద్భుతం గురించి.. వండ‌ర్ వీడియో గురించి చెప్పాల్సిందే. తాజాగా పీఎస్ ఎల్ వీ సీ-45 రాకెట్ ను ఈ రోజు ఉద‌యం విజ‌య‌వంతంగా లాంచ్ చేశారు.

ఆకాశంలోకి దూసుకెళ్లిన రాకెట్ ను చూసి ప‌లువురు సంత‌సించారు. మామూలుగా అయితే.. ఇక్క‌డితో ఈ ఇష్యూ క్లోజ్. కానీ.. ఈ రోజు అందుకు భిన్నంగా ప్ర‌యోగం జ‌రిగిన ప్ర‌దేశానికి 50 నాటిక‌ల్ మైల్స్ దూరంలో ఇండిగో విమానం వెళుతోంది. దీన్ని న‌డ‌పుతున్న పైలెట్‌.. నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్ వీడియోను వెంట‌నే తీశారు.

ఇండిగో విమాన పైలెట్ కెప్టెన్ క‌రుణ్ కారుబ‌యా.. నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్ వీడియో తీసి.. దాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదిప్పుడు వైర‌ల్ గా మారింది. లేడిస్ అండ్ జెంటిల్ మెన్స్.. విమానం కుడి వైపు ఉన్న కిటికీ నుంచి పీఎస్ ఎల్ వీ శాటిలైట్ లాంఛ్ ను మీరూ చూడండి అంటూ వీడియో పోస్ట్ చేశారు. ఇలాంటి అరుదైన వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చూసి ఉండ‌ర‌న‌టంలో సందేహం లేదు. ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ వీడియోను చూసేయండి. పైలెట్ పెట్టిన వీడియోకు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ త‌మ అనుభూతిని ప‌లువురు రిప్లై రూపంలో ఇస్తున్నారు.

For Video Click Here