Begin typing your search above and press return to search.
5వేల మందికి వలేసి300మందినిలోబర్చుకున్నాడు
By: Tupaki Desk | 24 Oct 2015 4:24 AM GMTమరో దుర్మార్గుడి వ్యవహారం బయటపడింది. చూసేందుకు పీలగా.. పొట్టిగా ఉండే ఈ దుర్మార్గుడి క్రిమినల్ మైండ్ చూసి పోలీసులు సైతం షాక్ తినే పరిస్థితి. అమ్మాయిల్ని బోల్తా కొట్టించి.. వారిని లొంగదీసుకొన్న వైనం సంచలనం సృష్టించింది. ఈ మానవ మృగం ఇలా ఇప్పటివరకూ మోసం చేసిన మహిళల సంఖ్య ఏకంగా 300 దాటటం గమనార్హం.
విపరీతమైన మనస్తత్వం ఉన్న ఇతగాడి అసలు పేరు కలబంద మధు. 33 ఏళ్ల వయసున్న ఈ సైకో స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏంసీఏ.. ఎంబీఏ.. లా కోర్సులు చేశాడు. 2007లో భారత ఆహార సంస్థ అయిన ఎఫ్ సీఐలో అసిస్టెంట్ మేనేజర్ గా చేరి.. నాలుగేళ్ల క్రితం (2011) నగరానికి బదిలీ మీద వచ్చాడు. అమ్మాయిల్ని ట్రాప్ చేసి అనుభవించే ఈ సైకో తన ప్రయత్నాలు షురూ చేశాడు.
ఇందులో భాగంగా కొత్తపేటలోని ఇంటర్నెట్ పాయింట్ నుంచి శివ అనే యువకుడి సాయంతో టెన్త్.. ఇంటర్.. పీజీలకు ప్రిపేరయ్యే యువతుల వివరాలు సేకరించాడు. హాల్ టిక్కెట్లలో ఉండే ఫోటో.. ఫోన్ నెంబర్ల ద్వారా వీరి మీద వల విసిరేవాడు. సిటీలోని బండ్లగూడ.. సాయినగర్ కాలనీలో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. ఎడ్యుకేషనల్ కన్సెల్టెన్సీలు ఓపెన్ చేసి.. యువతులకు గాలం వేసేవాడు.
ఇతగాడు సేకరించిన మహిళల ఫోన్ నెంబర్లు దాదాపు 5 వేల వరకూ ఉండటం గమనార్హం. తన వద్దనున్న ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎడ్యుకేషనల్ కన్సెల్టెన్సీ ప్రతినిధిగా ఫోన్చేసి.. మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. నెమ్మదిగా పరిచయం పెంచుకొని తన కోరిక తీర్చుకునేవాడు. ఒకవేళ ఫోన్ చేసిన సమయంలో సదరు విద్యార్థిని తండ్రి కానీ తల్లి కానీ మాట్లాడితే.. వారి ఫోన్ నెంబర్ ఎదుట డేంజర్ అని రాసుకునేవాడు. అదే సమయంలో గట్టిగా తిట్టేసినా.. అరిచినా.. ఇతగాడి మాటలకు లొంగకున్నా వేస్ట్ అని రాసుకునేవాడు. ఇక.. లొంగిన వారి ఫోన్ నెంబర్ల ఎదుట ‘‘ఓవర్’’ అని రాసుకునేవాడు.
తాను డేంజర్ అని రాసుకున్న వారికి మాత్రం మధు మళ్లీ ఫోన్ చేసేవాడు కాదు. ఇక.. తనకు లొంగిన అమ్మాయిలకు సంబంధించిన విజువల్స్ ను షూట్ చేసి వారిని బెదిరించేవాడు. తన మాట వినకుండా సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తానని చెప్పేవాడు.
ఇలా బెదిరింపులకు పాల్పడి కొంతమంది అమ్మాయిల దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసేవాడు. ఫోన్ల ద్వారా.. ఉత్తరాల ద్వారా చదువుకు సంబంధించిన సమాచారం అందిస్తానని పరిచయం కోసం వల విసిరేవాడు. ఇటీవల ఇద్దరు బాధిత విద్యార్థినులు షీ టీమ్స్ కు ఇతని గురించి సమాచారం ఇచ్చారు. నెల రోజుల పాటు వల వేసి ఇతగాడి కార్యకలపాలన్నీ తనిఖీ చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఇతని ఇంటిని తనిఖీ చేసినప్పుడు కట్టల కొద్దీ గర్భనిరోధక మాత్రలు కనిపించాయి. అదే సమయంలో.. పెద్ద ఎత్తున కండోమ్ లు కూడా లభించాయి. చదువు.. ఉద్యోగం పేరు చెప్పి అమ్మాయిలకు మాయమాటలు చెబుతూ.. వారిని ట్రాప్ చేసి అనుభవించిన ఈ సైకో ఉదంతం పోలీసు వర్గాలకు విస్మయానికి గురి చేస్తోంది. ఈ సైకో వినియోగించిన ఫోన్ నెంబర్లను పోలీసులు విడుదల చేశారు. సదరు నెంబర్ల వల్ల మోసానికి గురైతే.. ఈ విషయాన్ని పోలీసులకు వెల్లడించాలని.. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని.. వారి వివరాలు బయటకు రాకుండా భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. మరి.. రానున్న రోజుల్లో ఈ సైకో గురించి మరెన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయో..?
ఇతగాడు వినియోగించిన ఫోన్ నెంబర్లు ఇలా ఉన్నాయి..
91547 21308
91547 78049
96183 72501
96183 77940
96183 89157
96183 26075
91545 19527
80196 42075
70754 63017
98492 36478
80196 48205
81795 26248
90631 81156
73963 25864