Begin typing your search above and press return to search.
అమ్మాయిల లోదుస్తులే అతడి టార్గెట్..హాస్టళ్లల్లో దూరి దొంగతనం
By: Tupaki Desk | 26 July 2020 11:30 PM GMTఓ సైకో దొంగను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. అతడు దొంగతనం చేసే వస్తువులు ఏమిటో తెలిస్తే షాకవ్వాల్సిందే. అమ్మాయిల వసతిగృహాల్లోకి దూరి అమ్మాయిల లోదుస్తులను దొంగతనం చేసుకుని వెళ్లిపోతాడు. అనంతరం ఆ దుస్తులను చింపేసి పరమానందం పొందుతాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని విజయ్ నగర్‌లో శ్రీకాంత్ అనే 28 ఏళ్ల యువకుడు అమ్మాయిల హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని దూరేవాడు. అర్ధరాత్రి వేళలో అమ్మాయిల హాస్టళ్లలోకి ప్రవేశించి వారి లోదుస్తులను దొంగిలించి వాటిని చించేసేవాడు. గదుల్లో ఆరేసిన - అల్మారాల్లో పెట్టుకున్న వాటిని దొంగతనం చేసి చాకచక్యంగా తప్పించుకునేవాడు. ఇలా చాలాసార్లు అనేక హాస్టల్స్‌లో ప్రవేశించి అమ్మాయిల లోదుస్తులు దొంగతనం చేశాడు. ఈ ఘటనపై పలుమార్లు హాస్టల్ నిర్వాహకులు పట్టుకునే యత్నం చేసినా తప్పించుకున్నాడు. ఈ ఘటనలపై హాస్టల్ అమ్మాయిలు భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో స్థానిక నగర్ సురక్ష సమితి, సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేసి వారి సహకారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నిందితుడు ఓ హాస్టల్లోకి ప్రవేశించిన విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా వలపన్ని అతడిని అరెస్ట్ చేశారు. విచారణ చేయగా పై విషయాలు వెల్లడయ్యాయి. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు.