Begin typing your search above and press return to search.

పబ్‌జీ ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్ ... నేటి నుండి ఇక కనబడదు !

By:  Tupaki Desk   |   30 Oct 2020 12:33 PM GMT
పబ్‌జీ ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్ ... నేటి నుండి ఇక కనబడదు !
X
పబ్‌ జీ .. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పేరు బాగా సుపరిచితమే. ముఖ్యంగా యువత నిద్రలేచినప్పటి నుండి మళ్లీ నిద్రపోయే వరకు పబ్ జీ ఆడుతూనే ఉండేవారు. పబ్‌ జీ మొబైల్, పబ్‌ జీ మొబైల్ లైట్ గేమ్స్ ఇండియాలో ఈరోజు నుంచి పూర్తిగా కనుమరుగు అవుతుంది. ఈ గేమ్ ని ఇప్పటికే బ్యాన్ చేశారు కదా , మరి ఇప్పుడేంటి ఈ రోజు నుండి బ్యాన్ అంటున్నారు అంటే, ఈ గేమ్‌ను భారత ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసింది. కానీ, దీన్ని ఈ బ్యాన్ కన్నా ముందే యాప్ డౌన్‌ లోడ్ చేసుకున్నవారు గేమ్‌ను ఆడే అవకాశం మాత్రం ఉండేది. కానీ, ఇకపై వారికి కూడా గేమ్ ఆడే అవకాశం ఉండదు.

బ్యాన్ కంటే ముందే డౌన్‌ లోడ్ చేసుకున్న వారు ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారికి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. అక్టోబర్ 30 నుంచి పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ గేమ్ అందుబాటులో ఉండదని పబ్‌జీ అధికారికంగా ప్రకటించింది. అంటే డౌన్‌లోడ్ చేసుకున్నవారు కూడా ఈ గేమ్ ఆడటం సాధ్యం కాదు. అక్టోబర్ 30 నుంచి ఇండియాలో తమ సేవల్ని నిలిపివేస్తామని, యూజర్లను తొలగిస్తామని టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పబ్‌జీ మొబైల్, పబ్‌ జీ మొబైల్ లైట్ యాప్స్ ముందే ఇన్‌ స్టాల్ చేసుకున్నవారితో పాటు ఏపీకే ఫైల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నవారు కూడా ఈ గేమ్ ఆడలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నుంచి ఇండియాలో పబ్‌జీ మొబైల్, పబ్‌ జీ మొబైల్ లైట్ యాప్స్ ఏ రకంగానూ పనిచేయవు. ఇక పబ్ ‌జీ మొబైల్‌ కు సంబంధించిన పబ్లిషింగ్ రైట్స్‌ ని పబ్‌జీ కార్పొరేషన్‌ కు అందిస్తున్నట్టు ఫేస్ ‌బుక్ పోస్టులో పబ్‌జీ మొబైల్ ఇండియా వెల్లడించింది.ఇకపోతే , యూజర్ల డేటా, సెక్యూరిటీ ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం 118 యాప్స్‌ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వాటిలో పబ్‌ జీ మొబైల్, పబ్ ‌జీ మొబైల్ లైట్ యాప్స్ ‌తో పాటు టిక్ టాక్, వీచాట్, క్యామ్ స్కానర్ లాంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి.