Begin typing your search above and press return to search.
పబ్‌జీ 'ఆట' కట్టు..! ఎక్కువసేపు ఇక ఆడలేరు..?
By: Tupaki Desk | 23 March 2019 8:40 AM GMTఇద్దరు స్నేహితులు మొబైల్ పట్టుకొని ఉన్నారంటే ఒకప్పుడు చాట్ చేసుకుంటున్నారని అనుకొనే వాళ్లు.. కానీ ఇప్పుడు వారిద్దరు పబ్‌జీ గేమ్ ఆడుతున్నారని అనుకోవచ్చు.. సమయంతో సంబంధం లేకుండా నిత్యం మొబైల్ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌తో బిజీగా ఉంటున్నారు నేటి యువకులు. సరదా కోసం ఆడే ఈ గేమ్‌తో ప్రాణాలు పోతుండడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. గేమ్ ఆడుతూ రైలుని ఢీకొని.. ఆదే పబ్‌జీతో ఉంటూ నీళ్లనుకొని యాసిడ్ తాగి యువకులు మృత్యువాత పడిన సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని జగిత్యాలకు చెందిన ఓ యువకుడు పబ్‌జీ గేమ్ ఆడుతూ మెడ నరాలు పట్టుకొని మరణించడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
* పబ్ జీని ఎవరు ప్రారంభించారు..?
ఐరిస్ దేశానికి చెందిన బాండన్ గ్రీన్..ఈ గేమ్ రూపకల్పనకు ఆర్థికసాయం చేశాడు. ఇతనికి మొదటి నుంచి గేమ్స్ ఆడడం అలవాటు. కాలేజీకి వెళ్లకుండా గేమ్స్ ఆడాలనే కోరిక ఎక్కువగా ఉండేది. ఆయన ఎక్కువగా 'ఆర్మా' అనే గేమ్‌ను ఆడేవాడు. ఆ తరువాత ఆయనకు సోనీ కంపెనీ క్రియేట్ చేసిన 'కింగ్ ఆఫ్ ది కిల్' అనే గేమ్ వర్క్ చేసే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాలు ఇందులో పనిచేసిన తరువాత సొంతగా గేమ్‌ను తయారు చేయాలనుకొన్నాడు. 2017 డిసెంబర్‌లో సిస్టమ్ ఎక్స్‌బక్స్ ప్లాట్‌ఫాంపై పబ్‌జీ గేమ్‌ను ప్రారంభించారు. సంవత్సరం తిరగకముందే మిగతా గేమ్‌లను దాటేసి ఇది ముందుకెళ్లింది. ఆ తరువాతి సంవత్సరం 2018 ఫిబ్రవరిలో మొబైల్‌లో ప్రారంభమై ఆండ్రాయిడ్ వర్షన్‌లోకి వచ్చింది. దీంతో రోజూ లక్షల మంది ఈ గేమ్‌ను ఆడుతున్నారు.
* 'బ్యాటిల్ రైయిడ్' సినిమా ఆధారంగా..
'బ్యాటిల్ రైయిడ్' అనే జపాన్ సినిమా ద్వారా ఈ పబ్ జీ గేమ్ తయారైందని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఐదారుగురు స్టూటెంట్స్‌ను బాధపెట్టడం.. వారిని ఒక ఐలాండ్‌లో విడిచిపెడితే.. వారు ఎలా భయటపడ్డారనేది యాక్షన్‌తో కూడిన సన్నివేశాలుంటాయి. పబ్‌జీ గేమ్‌లో చూపించే వెపన్స్, ప్లేయర్స్ 'బ్యాటిల్ రైయిడ్' మూవీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. క్రాస్‌గో, గన్, సిక్కిం, లైట్ హౌస్ నుంచి మ్యాప్ వరకు అన్నీ ఈ మూవీ నుంచి తీసుకున్నవేనని అర్థమవుతుంది.
* పబ్ జీ ఎలా పాపుల్ అయింది..?
ఈ గేమ్ ఆడుతున్నవారు తామే అక్కడున్నామన్న ఫీలింగ్.. యాక్షన్‌తో కూడిన సస్పెన్స్ ఉండడంతో పాపులర్‌గా మారింది. ఎక్కువగా యువకులు దీనిని వ్యసనంలాగా మార్చుకున్నారు. మొబైల్ గేమ్స్ అంటే ఇష్టపడని వారు సైతం ఒక్కసారి పబ్‌జీ ఆడితే దానికి అడిక్ట్ అవుతున్నారు. అయితే రాను రాను అది ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ గేమ్‌ను ఆడుతూ చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. పబ్‌జీని నిషేధించాలని ఇండియాలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు ఈ గేమ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.
* ఆరుగంటల తరువాత గేమ్ బంద్..!
పబ్‌జీ గేమ్ నుంచి విముక్తి పొందడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇండియాలో ఎవరైనా పబ్‌జీ గేమ్ 6 గంటలు ఆడగానే ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుంది. 24 గంటల తరువాత మళ్లీ ఈ గేమ్‌ను ఆడుకోవచ్చు. ప్లేయర్స్ హెల్త్ రిమైండ్ పేరుతో ఓ మేసేజ్ రాగానే గేమ్ ఆగిపోతుంది. ఆ గేమ్ ప్రవేశపెట్టిన కంపెనీపై భారత్ ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన విడుదల కావాల్సి ఉంది.