Begin typing your search above and press return to search.

ఫుడ్ అండ్ మింక్..ఓటీపీ లేకపోతే నో ఎంట్రీ..: అంతా హైటెక్

By:  Tupaki Desk   |   4 April 2022 4:51 AM GMT
ఫుడ్ అండ్ మింక్..ఓటీపీ లేకపోతే నో ఎంట్రీ..: అంతా హైటెక్
X
హైదరాబాద్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై జరిగిన దాడి సంచలన సృష్టిస్తోంది. డీఎస్పీ లెవల్లో ఈ కేసు విచారణ సాగుతుండడంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతా హైటెక్ వ్యవహారంలో ఈ పబ్ ను నడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోకి ఎంట్రీ కావాలంటే ఆషామాషీ కాదు. ఓటీపీ ఎంట్రీ చేస్తే గానీ ఈ పబ్లోకి వెళ్లలేము. అందుకే ఇందులో సెలబ్రెటీలు, ఉన్నత వర్గాలకు చెందిన వారే ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రాడిసన్ హోటల్ పై జరిపిన దాడిలో పబ్ నిర్వాహకులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉండడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. దాడి సమయంలో పోలీసులకు దొరికిన శాంపూల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ రిపోర్టు ఆధారంగా విచారణను వేగవంతం చేయనున్నారు.

సాధారణంగా పబ్లోకి ఎంట్రీ కావాలంటే ఎంతోకొంత ఎంట్రీ ఫీజు చెల్లించాలి. కానీ పుడ్ అండ్ మింక్ పబ్లోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఆషామాషీ కాదు. దీనికి హైటెక్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పబ్లోకి వెళ్లాలంటే కోడ్ కంపల్సరీ. వీరికి సంబంధించిన ఓ యాప్ ఉంటుంది. అందులో తమ వివరాలను వెల్లడించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత కస్తమర్లకు కోడ్ ను పంపిస్తారు. ఆ తరువాత ఆ కోడ్ చేబితేనే లోనికి అనుమతిస్తారు. ఆ కోడ్ చెప్పిన తరువాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తరువాత ఎంట్రీ కావచ్చు. అలా కూడా అందరికీ అనుమతి ఇవ్వరు. కొందరు సెలెక్టెడ్ పీపుల్స్ కు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఓ యాప్ ను సృష్టించి దాని ద్వారా పబ్ ను నిర్వహిస్తున్నారని డీఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు.

ఇక దాడి సమయంలో ఈ పబ్ లో 5 గ్రాముల కొకైన్ ను స్వాధీన చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే రైడ్ సమయంలో పబ్లో 148 మంది ఉన్నారని, వీరిలో కొందరు డ్రింక్ లో కొకైన్ వేసుకొకున్నట్లు గుర్తించామన్నారు. అయితే డ్రగ్స్ ను ఎవరు వినియోగించారన్నది అప్పుడే చెప్పలేమని, విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అందువల్ల అప్పుడే పబ్లోకి వచ్చిన వివరాలు వెల్లడించొద్దన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ లను అరెస్టు చేయగా.. మరో నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నాలుగు పోలీసుల బృందాలతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభించామని, ఈవెంట్ మేనేజర్ కునాల్, డీజే శశిధర్ రావులపై కీలక పాత్రలపై ఆరా తీస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఇక ఈ పార్టీలో పాల్గొన్న వారి వివరాలు సేకరించామన్నారు. అయితే వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టడం సరికాదన్నారు.

వారిలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తామే మీడియాకు సమాచారం అందిస్తామన్నారు. అనుమానం ఉన్నవారి శాంపిల్స్ సేకరిస్తామని తెలిపారు. దాడి సమయంలో మేనేజర్ క్యాబిన్ వద్ద ఐదు కొకైన్ ప్యాకేట్లు దొరికాయని తెలిపారు. ఈ పబ్ లోని మేనేజర్ గతంలో గోవాలో పనిచేసి ఇక్కడికి వచ్చారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్ గా ఉందని, అందుకే ఈ కేసుపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. ఈ కేసులో భాగంగా సదరు ఫుండ్ అండ్ మింక్ పబ్ 24 గంటలు తెరిచి ఉంటుందని కస్టమర్లను ఆకర్షించారని, అయితే డ్రగ్స్ ప్యాకెట్లు దొరకడంతో ఎవరు వినయోగించారు..? ఎవరు తీసుకోలేదు..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. అంతేకాకుండా ఇక్కడికి గోవాకు లింకులు ఉన్నాయో లేవో కూడా తేలుస్తామని తెలిపారు.