Begin typing your search above and press return to search.
పూడి రమేశ్‌లా సీమాంధ్ర నేతలు ఉండరే..?
By: Tupaki Desk | 11 April 2015 6:47 AM GMTఇంతకీ ఈ పూడి రమేశ్ ఎవరు? సినిమా పరిశ్రమకు చెందిన వారా? లేదంటే.. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తా? పేరు చూస్తుంటే ఈ రెండు రంగాలకు ఏ మాత్రం కనెక్ట్ అయినట్లుగా కనిపించని పరిస్థితి. మరి అలాంటప్పుడు.. పూడి రమేశ్ లాంటి వ్యక్తి తెర మీదకు ఎందుకు వచ్చినట్లు..?
పాయింట్‌లోకే వస్తున్నాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని లేని ఏపీ రాష్ట్ర సర్కారు పడుతున్న ఇబ్బందులకు ఏజీ ఆఫీసులో పని చేసే అసిస్టెంట్ ఆడట్ ఆఫీసర్‌పూడి రమేశ్ కదిలిపోయారు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా.. తాను రూపాయి.. రూపాయి దాచుకున్న రూ.8లక్షల మొత్తాన్ని రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందజేశారు.
ఒక చిరుద్యోగి ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించటంచూసినప్పుడు సంతోషం వేస్తుంది? ఒక సీమాంధ్రుడు ఎంత త్యాగం చేస్తున్నాడన్న భావంతో మనసుకు హాయినిచ్చి.. భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచుతుంది. అదే సమయలో పూడి రమేశ్ మీద జాలి కలుగుతుంది. ఒక చిరుద్యోగి తాను కూడబెట్టిన మొత్తాన్ని ఏపీ రాష్ట్ర రాజధాని కోసం ఎలాంటి ఫలితం ఆశించకుండా విరాళం ఇచ్చేస్తే.. కేవలం ప్రజాసేవ చేయటానికి.. ప్రజల బాగోగులు చూసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయనాయకులు మరెంతలా స్పందించాలి?
ప్రజాప్రతినిధులు తమ జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తామని చెప్పే నేపథ్యంలో.. పూడి రమేశ్ మాదిరి తమ ఆస్తులు మొత్తం కాకున్నా.. ఎంతోకొంత మొత్తాన్ని రాజధాని కోసం విరాళంగా ఇవ్వాలి కదా? తెలుగు తమ్ముళ్ల వరకూ ఎందుకు? ఇప్పటివరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానేం ఇస్తున్నది ఇప్పటివరకూ చెప్పింది లేదు.
చంద్రబాబు ఏమీ ఆస్తులు లేని వ్యక్తి కాదు కదా. ఒక్క బాబు మాత్రమే కాదు.. విపక్ష నేత జగన్ కూడా. ఆయనైతే.. స్వల్ప వ్యవధిలో భారీగా ఆస్తులు కూడబెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సైతం ఏపీ రాజధాని నిర్మాణం కోసం తన వంతును ఇంతవరకూ వెల్లడించింది లేదు. అసలు ఆ ఉద్దేశ్యం ఉన్నట్లే కనిపించదు. ఇలా అధికార.. విపక్ష నేతల్లో లేని దాతృత్వం.. ఒక సామాన్యుడికి ఉండటం గొప్ప విషయమే. కానీ.. ఇబ్బంది అంతా అలాంటి సామాన్యుడు తన జీవితకాల కష్టాన్ని విరాళం రూపంలో ఇచ్చేయటం ద్వారా ఆయన కుటుంబసభ్యులు ఎంతకష్టపడతారు? ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో? పూడి రమేశ్ మాదిరి కాకున్నా.. తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు.. మిగిలిన నేతలు.. ఏపీ రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం ఎందుకు ప్రకటించరు?