Begin typing your search above and press return to search.
కరోనా ధాటికి చెట్ల కింద అసెంబ్లీ.. సీఎం పరుగులు!
By: Tupaki Desk | 26 July 2020 4:30 PM GMTకరోనా భయానికి అసెంబ్లీ మూసివేయడంతో దేశంలోనే తొలిసారి వేప చెట్ల కింద అసెంబ్లీ సమావేశం నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది.కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈ పరిస్థితి దాపురించింది.
విపక్ష పార్టీ ఎమ్మెల్యే జయబాల్ కు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సదురు ఎమ్మెల్యేకి మధ్యలో కరోనా పాజిటివ్ అని తేలడంతో హడలిపోయిన సీఎం - మంత్రులు - ఎమ్మెల్యేలు.. అసెంబ్లీని మూసివేసి వేప చెట్ల కిందకు పరుగులు తీసి అక్కడే ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మమ అనిపించడం విశేషం.
ఈనెల 20నుంచి పుదుచ్చేరి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అధికారి పరిగెత్తుకుంటూ అసెంబ్లీలోకి వచ్చి సీఎం నారాయణ స్వామి చెవిలో ఓ వార్త చెప్పారు. ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని సీఎం చెవిలో చెప్పారు.
ఎమ్మెల్యేకి కరోనా వచ్చిందని తెలియగానే సీఎం - మంత్రులు - ఎమ్మెల్యేలు వెంటనే అసెంబ్లీని ఖాళీ చేసి బయట ఉన్న చెట్ల కిందకు పరుగున వచ్చారు. ఆరుబయటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ను ఆమోదించి మమ అనిపించారు. కరోనా వచ్చిన ఎమ్మెల్యే నిన్నటి వరకు అసెంబ్లీకి రావడంతో సీఎం నారాయణ స్వామి సహా మంత్రులు, ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.