Begin typing your search above and press return to search.
2014లో టీడీపీ-బీజేపీ పెళ్లి..విడాకులకు బీజం
By: Tupaki Desk | 8 Jan 2018 5:02 AM GMTబీజేపీ-టీడీపీ మిత్రుత్వం ముందుకు సాగడంపై ఇప్పటికే రాజకీయవర్గాల్లో ఇంకా చెప్పాలంటే...ఇరు పార్టీల నేతల్లో అనేక సందేహాలు ముసురుకున్న సమయంలో... పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి భారీ సెటైర్ వేశారు. ఆ రెండు పార్టీల మధ్య విడాకులకు బీజం పడిందని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ విగ్రహం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను ముఖ్యమంత్రి నారాయణసామి ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ 2014లో పెళ్లి చేసుకున్నాయని - ప్రస్తుతం ఆ పార్టీల మధ్య విడాకులకు పునాదులు పడ్డాయని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాలు చేయడం తప్ప డబ్బులు మాత్రం ఇవ్వరని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. పోలవరం - ప్రత్యేక హోదా విషయాల్లో మోడీ - సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని - డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం తన నిధులతో పూర్తి చేయాల్సి ఉండగా - నాబార్డు నుంచి అప్పుతెస్తానని సీఎం చెప్పడం వింతగా ఉందన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటీ తప్ప వేరే పనిలేదన్నారు. కాంగ్రెస్ తప్ప మరేపార్టీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని చెప్పారు.
కాగా, నాలుగు రోజులపాటు పోలవరం పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజల హక్కు పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికీ అందేవరకు పోరాటం అన్న లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు ఈ యాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటిరోజు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు 12.5 కి.మీ. పాదయాత్ర చేశారు. రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే ప్రారంభిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.