Begin typing your search above and press return to search.
ఫెడరల్ ఫ్రంట్ కల నెరవేరదు కేసీఆర్
By: Tupaki Desk | 26 Dec 2018 6:20 AM GMTవేలు నారాయణ స్వామి.. కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా 2016 నుంచి పనిచేస్తున్నారు. ఈయన ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టారు.. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్ లు మినహా వేరే ఎటువంటి ఫ్రంట్ మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫ్రంట్ కల నెరవేరదని స్పష్టం చేశారు.
కేంద్రం నదీజలాల పంపిణీ భాగస్వామ్యం విషయంలో జాతీయ స్తాయి విధానం రూపొందించాలని పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. అన్నిరాష్ట్రాల అభిప్రాయం తీసుకొని ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఒక విధానాన్ని రూపొందించాలని వాటాలు పంచాలని కేంద్రాన్ని కోరారు. కావేరి నదిపై కేకేదాటు డ్యామ్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోలేదని విమర్శించారు. కేంద్ర ఏక పక్ష నిర్ణయం సరికాదని.. అనుమతులను వెనక్కి తీసుకోవాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు.
‘అన్ని రాష్ట్రాలు, దేశంలోని అధికార పార్టీలు అన్ని కలిసి తాజా వివాదాస్పద అంశాలపై చర్చించుకోవాలి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట ప్రాంతీయ పార్టీలను కూటమిగా చేసి వేరు చేస్తూ విఘాతం కలిగిస్తున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టే కాంగ్రెస్ - బీజేపీ లేకుండా ఏ సమస్యలు పరిష్కారం కావు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కల కూడా నెరవేరదు’ అంటూ తన అభిప్రాయాన్ని నారాయణ స్వామి వెల్లడించారు.
పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న నారాయణ స్వామిని సీఎం పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం. ఈయన సీఎం కాకముందు పాండిచ్చేరి ఎంపీగా కొనసాగారు.