Begin typing your search above and press return to search.
డిఫెన్స్ కి పేటెంట్ లా ఉన్నాడే..పుజారాపై ప్రశంసలు
By: Tupaki Desk | 17 Dec 2020 12:15 PM GMTఎన్నిపరుగులు సాధించామన్నది కాదు..! ఎంతసేపు క్రీజ్‌లో ఉన్నామన్నదే ముఖ్యం. టెస్ట్ ఇన్సింగ్స్‌లో డిఫెన్స్ ఆడటం తెలిసిన వాడే హీరో. గతంలో టీం ఇండియా తరఫున ఆడిన సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండి ప్రత్యర్థులకు పిచ్చెక్కించేవారు. బౌలింగ్‌ను మార్చి మార్చి వేసినా.. విభిన్నబంతులు వేసినా వాళ్లు మాత్రం అవుటయ్యేవారు కాదు. టెస్ట్క్రికెట్ లో భారీ షాట్లు ఆడటం ముఖ్యం కాదు. ఎక్కువ సేపు వికెట్ నిలబెడితేనే గెలిచే అవకాశాలు ఉంటాయి.
రాహుల్ ద్రవిడ్ కూడా జిడ్డు ఇన్నింగ్స్‌లు ఆడి చాలాసార్లు టీంఇండియాను గెలిపించాడు. అందుకే అతడు ‘ది వాల్’ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చటేశ్వర్ పుజారా కూడా అలాగే రాణిస్తూ ద్రవిడ్ లేని లోటును పూరుస్తున్నాడు.
తాజాగా అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా తడబడుతూ ఆటను ప్రారంభించింది. భారత్ ఒక్క పరుగు కూడా చేయకముందే ఓపెనర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. దీంతో క్రీజుల్లోకి వచ్చిన పుజారా 160 బంతులు ఆడి కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే అంతసేపు క్రీజులో ఉండటం చాలా గొప్పవిషయం. దీంతో నెటిజన్లు పృథ్వీ షాను సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లి 76వ ఓవర్లో ఔట్ 74 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరగ్గా.. 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే చాలామంది నెటిజన్లు పుజారాను మెచ్చుకుంటున్నారు. టీం ఇండియాకు మరో ద్రవిడ్ దొరికాడంటూ కామెంట్లు పెడుతున్నారు.