Begin typing your search above and press return to search.

ఏపీ రాష్ట్ర చేపగా పులస?

By:  Tupaki Desk   |   22 July 2016 6:57 AM GMT
ఏపీ రాష్ట్ర చేపగా పులస?
X
తెలంగాణ రాష్ట్ర చేప‌గా కొర్ర‌మ‌ట్ట‌(కొర్ర‌మీను)ను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఏపీలోనూ రాష్ట్ర చేప‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఒక వేళ ప్ర‌క‌టిస్తే రాష్ట్ర చేప‌య్యే అవ‌కాశం దేనికి ద‌క్కుతుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఎక్కువ‌గా అంద‌రూ పుల‌స పేరు ప్ర‌స్తావిస్తున్నారు. పుల‌స‌ను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు కూడా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపగా పులస చేపను ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కొరమీను చేపను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించి రుచికరమైన ఈ చేపను రాష్ట్ర చేపగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసిఎఆర్) 2007 ఒక ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చింది. చేపల పరిరక్షణ చర్యలో భాగంగా ఒక చేపను రాష్ట్ర చేపగా ప్రకటించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న‌ప‌పుడు కొరమీనును రాష్ట్ర చేపగా ప్రకటించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర చేపగా కొరమీనును బుధవారం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించి పులసను రాష్ట్ర చేపగా ప్రకటించాలని కొంతమంది నెటిజెన్లు పులస ఎపిస్టేట్ ఫిష్ పేరుతో ప్రచారం చేస్తున్నారు.

అయితే... రాష్ట్ర ప‌క్షి - రాష్ట్ర జంతువు - రాష్ట్ర వృక్షం వంటివి చాలా రాష్ట్రాల‌కు ఉన్నా రాష్ట్ర చేప ఉన్న‌ది మాత్రం చాలా త‌క్కువ‌. కేర‌ళ‌ - మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ర్టాల‌కు మాత్ర‌మే ఇంత‌వ‌ర‌కు రాష్ట్ర చేప‌లు ఉన్నాయి. తాజాగా తెలంగాణ ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఏపీ కూడా చేరితో పుల‌స‌కే ఆ అవ‌కాశం దొరికొచ్చ‌ని భావిస్తున్నారు.

కానీ, వాస్త‌వాలు ప‌రిశీలిస్తే పుల‌స రాష్ట్ర చేప‌గా ప్ర‌క‌టించ‌డానికి అర్హ‌త క‌నిపించ‌డం లేదు. ఇది ఆస్ర్టేలియాలోని స‌ముద్ర ప్రాంతంలోని చేప‌.. అక్క‌డి నుంచి వ‌ల‌స వ‌చ్చి తూర్పుగోదావ‌రి జిల్లాలో స‌ముద్రం నుంచి గోదావ‌రి న‌దిలోకి ప్ర‌వేశిస్తుంది. గోదావ‌రిలో నీటికి ఎదురీదుతూ వెళ్తుంది. గోదావ‌రిలో ప్ర‌వేశించాక దొరికే ఈ చేప‌కు విప‌రీత‌మైన డిమాండు ఉంది. పుస్తెల‌మ్మి అయినా పుల‌స తినాలని అంటారు. ధ‌ర కూడా వేలల్లో ఉంటుంది. అంతా బాగానే ఉన్నా ఆస్ట్రేలియాకు చెందిన ఈ చేప‌కు రాష్ట్ర చేప హోదా ఎలా ఇస్తార‌న్న‌దే ప్ర‌శ్న.