Begin typing your search above and press return to search.

అంతుచూస్తానంటూ టీడీపీ నేత వీరంగం

By:  Tupaki Desk   |   21 Dec 2018 10:46 AM GMT
అంతుచూస్తానంటూ టీడీపీ నేత వీరంగం
X
చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జి పులివర్తి నాని అర్థరాత్రం వీరంగం సృష్టించాడు. గురువారం రాత్రి తిరుపతి రూరల్ మండలం అవిలాలలో దళిత నేత హరినాథ్ పై ఆయన దౌర్జన్యాన్ని చూసి మహిళలు భీతిల్లిపోయారు.

అవిలాలకు చెందిన హరినాథ్ వైసీపీ నాయకుడిగా గ్రామంలో అందరికీ సుపరిచితమే.. బలమైన ఈయన్ను టీడీపీలోకి లాగేందుకు స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నించారు. కానీ హరినాథ్ మొదట టీడీపీ కండువా కప్పుకొని తరువాత టీడీపీ నేతల వైఖరి నచ్చక తిరిగి వైసీపీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. విషయం తెలుసుకున్న టీడీపీ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్వయంగా హరినాథ్ ఇంటికి వచ్చాడు. అక్కడ వైసీపీ నాయకులతో కలిసి హరినాథ్ ఉండడాన్ని చూసి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. బయటకు రావాలని కోరినా హరినాథ్ రాకపోవడంతో నాని రెచ్చిపోయారు.

అక్కడే ఉన్న దళిత నేత శ్రీరాములు వారిస్తున్న అతడిపైకి దూసుకెళ్లి రౌడీయిజం ప్రదర్శించాడు. ఎక్కడి నుంచో దిగుమతి అయ్యి మా నియోజకవర్గంలో ఏం చేస్తున్నావంటూ శ్రీరాములు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత నాని అరుపులు, కేకలు, బెదిరింపులకు స్థానికులు హడలి చచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింప చేసి పంపించివేశారు.