Begin typing your search above and press return to search.
పులివెందులలో టీడీపీకి కొత్త తలపోటు!
By: Tupaki Desk | 9 Jun 2022 4:21 AM GMTవైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి తలపోటు మొదలైందని చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ దృష్టి పెట్టడంతో.. టీడీపీ కూడా తాను తక్కువేం తినలేదన్నట్టు జగన్ నియోజకవర్గం పులివెందులలో ఈసారి ఆయనను ఓడించడానికి కంకణం కట్టుకుంది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు అప్పుడే లుకలుకలు మొదలు కావడంతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుని కూర్చుందని అంటున్నారు.
దివంగత వైఎస్సార్ హయాం నుంచి పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. వైఎస్సార్ తోపాటు ఆయన కుమారుడు వైఎస్ జగన్ తో పలుమార్లు ఎన్నికల్లో తలపడ్డ సతీష్ రెడ్డి ఒక్కసారి కూడా గెలుపొందలేదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా కూడా చేశారు. అయితే ఈ పదవీకాలం కూడా తీరిపోయింది.
ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ బీటెక్ రవి కీలకంగా వ్యవహరిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరు కూడా రవికి ఉంది. దీంతో బీటెక్ రవిని చంద్రబాబు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నియమించారు. మరోవైపు సతీష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరతారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు.
అయితే ఎన్నో ఏళ్ల నుంచి సతీష్ రెడ్డితో తమ ప్రయాణం సాగిస్తున్న పులివెందుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనే తమ ఇన్చార్జిగా ఉండాలని కోరుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు సతీష్ రెడ్డితో సమావేశమైన టీడీపీ శ్రేణులు బీటెక్ రవి తమకొద్దని.. మీరే ఇన్చార్జిగా ఉండాలని సతీష్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. బీటెక్ రవి తమను ఇబ్బందులు పెడుతున్నారని.. ఆయనను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని వాపోతున్నారని సమాచారం. కాబట్టి మీరే టీడీపీ ఇన్చార్జిగా ఉండాలని సతీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
ఇదే సమయంలో సతీష్ రెడ్డి కూడా తనను కలసిన టీడీపీ శ్రేణులతో తన ఆవేదన పంచుకున్నారు. గత 30 ఏళ్లుగా టీడీపీకి కృషి చేశానని.. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తనను అనుమానిస్తున్నారని వారి వద్ద గోడు వెళ్లబోసుకున్నారంట. తాను వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయానని చంద్రబాబు శంకిస్తున్నారని.. ఇన్నేళ్లు టీడీపీలో నమ్మకం పనిచేస్తే తనకు దక్కిన బహుమానం ఇదా అని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయినా తానెక్కడా పార్టీ వీడలేదని, పార్టీ క్యాడర్ కూడా చెక్కుచెదరకుండా చేశానని.. చూశానని గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఇప్పటికైనా తనను నమ్మి పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్జార్జి పదవిని తనకు అప్పగిస్తే బాధ్యతగా నిర్వహిస్తానని టీడీపీ శ్రేణులకు చెప్పారని తెలుస్తోంది. దీంతో టీడీపీ నియోజకవర్గ నాయకులు ఈ విషయాన్ని తాము పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని సతీష్ రెడ్డికి ధైర్యం చెప్పారని సమాచారం.
మరోవైపు ఈ పరిణామాలపై బీటెక్ రవి మండిపడుతున్నారు. టీడీపీని కాదనుకొని వైఎస్సార్సీపీలో చేరాలని చూసిన సతీష్ రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకుని మళ్లీ టీడీపీలోకి వస్తారని బీటెక్ రవి వర్గం ప్రశ్నిస్తోంది. పులివెందుల నియోజకవర్గ నేతలు సతీష్ రెడ్డిని కలవడంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని రవి వర్గం నిర్ణయించిందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలనుకుంటే ఈ కుమ్ములాటలు ఏంటని టీడీపీ అధిష్టానం మథనపడుతోందని అంటున్నారు.