Begin typing your search above and press return to search.
సీఎం ముందున్న మైకు లాగేయటం వీరత్వం కాదు.. గొప్ప అసలే కాదు
By: Tupaki Desk | 10 Sep 2022 4:39 AM GMTకొందరి మాటలు నచ్చవు. విధానాలు అసలే సూట్ కావు. అంత మాత్రానికి నోటికి పని చెప్పటం.. చేతికి తోచినట్లు చేస్తే అదే మాత్రం సమర్థనీయం కాదు. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. అందునా రాజకీయాల్లో ఉన్న వారు మరిన్ని జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే.. హైదరాబాద్ మహానగర నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్ వద్ద భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్ శర్మ.
వేదిక మీద ఉన్న వేళలో.. అనూహ్యంగా అక్కడకు వచ్చిన టీఆర్ఎస్ చోటా నేత నంద కిశోర్.. సీఎం ముందున్న మైకు పక్కకు లాగేయటం షాకింగ్ గా మారింది. క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి ఆయన్నుపక్కకు లాగేశారు. అయితే.. సదరు టీఆర్ఎస్ చోటా నేత చేసిన పనిని కొందరు కీర్తించటం షురూ చేశారు.
సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వారు కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ ను పల్లెత్తు మాట అంటే ఊరుకునేది లేదని.. తెలంగాణకు వచ్చి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకుంటామా? అని ప్రశ్నిస్తున్నారు. తమ సీఎంను విమర్శిస్తే.. ఇలాంటి ట్రీట్ మెంట్ తప్పదన్నట్లుగా మాట్లాడుతున్న తీరు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు.
ఇవాల్టి రోజున హైదరాబాద్ కు వచ్చిన అసోం సీఎం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించటం.. దాన్ని తట్టుకోలేని గులాబీ పార్టీకి చెందిన చోటా నేత ఒకరు మైకును లాగేయటం ద్వారా తన నిరసనను తెలియజేశారు. అయితే.. ఇలాంటి విధానమే సరికాదని చెప్పాలి.
ఇలా ఎవరికి వారు వారి స్థాన బలాన్ని చూపించే ప్రయత్నం చేసి.. దాన్ని వీరత్వంగా కీర్తించుకుంటే.. జాతీయ పార్టీ పెట్టే కేసీఆర్ రేపొద్దున గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీని విమర్శిస్తే.. వారు కూడా ఇదే తీరులో రియాక్టు అయితే.. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు..
కార్యకర్తలు స్పందించిన తీరులోనే రేపొద్దున అక్కడి బీజేపీ నేతలు అలానే వ్యవహరిస్తే.. ఊరుకుంటామా? విమర్శల వర్షాన్ని కురిపిస్తాం కదా? ఇప్పుడు అసోం సీఎం విషయంలోనూ ఇలాంటి తొందరపాటుతో వ్యవహరించే అతిగాళ్లను నిలువరించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఫ్యూచర్ లో మరిన్ని కష్టాలు.. ఇబ్బందులు.. చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.