Begin typing your search above and press return to search.
'చంపేశాడు...' ఉగ్రదాడి వీడియో వైరల్
By: Tupaki Desk | 15 Feb 2019 11:20 AM ISTజమ్మూకాశ్మీర్ లో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా జిల్లాలోని అవంతిపురలో జరిగిన ఆత్మహుతి దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. సెలవులు ముగించుకొని తిరిగి విధుల్లోకి వెళ్తున్న జవాన్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీనగర్ నుంచి జమ్ముకు వెళ్లే తరుణంలో శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ అఘాయిత్యం తామే చేశామని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రముఠా జైష్ ఎ మహ్మద్ ప్రకటించింది.
జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యింది.ఈ వీడియోలో 'చంపేశాడు.. శవాలు పడుతున్నాయి' అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియో చూస్తే ఓ వ్యక్తి ఆత్మాహతి దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అందువల్లే ఇంత నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, తుక్కుతుక్కయిన వాహన భాగాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పుల్వామా జిల్లాలోని కాకాపొరకు చెందిన అదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి భారీ బాంబులు, విస్ఫోటన మందుగుండును, ఆయుధాలకు స్కార్పియో వాహనంలో నింపుకొని జవాన్ల బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సులోని వారెవరు బతకలేదని అర్థమవుతోంది. అయితే జవాన్లు బయలుదేరిన వాహనం సమాచారం ఉగ్రవాదులకు ఎలా లీకైందని ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. లీక్ కావడం వల్లే పక్క ప్రణాళికతో ఉగ్రవాదులు అవంతిపురలో మాటువేసి ఈ పన్నాగానికి ఒడిగట్టారని తెలుస్తోంది. స్కార్పియో వాహనం బస్సును ఢీకొట్టిన అనంతరం తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయిని సమీపంలోని వారంటున్నారు. అంటే అక్కడే ఉన్న కొందరు ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు.
అయితే ఈ భారీ ప్రమాదానికి మిలటరీ తప్పు కూడా కొంత ఉంది. గత కొన్ని రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడంతో రాకపోకలు నిలిచాయి. దీంతో జమ్మూ - కాశ్మీర్ ప్రధాన రహదారిలో ఒకేసారి ఎక్కువ మంది జవాన్లను తరలించాల్సి వచ్చిందని అంటున్నారు. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.