Begin typing your search above and press return to search.

బంగారు బాబును ఎందుకు చంపారు?

By:  Tupaki Desk   |   17 July 2016 7:58 AM GMT
బంగారు బాబును ఎందుకు చంపారు?
X
గుర్తుండే ఉంటుంది ఆ మధ్య ఒక బంగారు బాబు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒంటి మీద మూడున్నర కిలోల బంగారం చొక్కా ధరించి మీడియాలో ప్రముఖంగా కనిపించిన ఆ వ్యక్తి పేరు దత్తాత్రేయ ఫూగే. బంగారం మీద తనకున్న వ్యామోహాన్ని చాటుకుంటూ ఏకంగా కోటి రూపాయలు పెట్టి పూర్తిగా బంగారంతో ఆ చొక్కా చేయించుకోవడమే కాదు.. అది తొడుక్కుని మీడియాకు ఫోజులు కూడా ఇచ్చాడు. పబ్లిక్ లోనూ తిరిగాడు. ఆ బంగారు బాబును కేవలం లక్షన్నర రూపాయలకు సంబంధించిన వివాదం వల్ల చంపేశారు. దత్తాత్రేయ స్నేహితులే అతణ్ని చంపేయడం.. అందులోనూ తన కొడుకు కళ్ల ముందే దత్తాత్రేయ హత్యకు గురవడం సంచలనం రేపుతోంది.

పుణెకు చెందిన దత్తాత్రేయ ఓ వడ్డీ వ్యాపారి. అతడికి అతుల్ మోహిత్ అనే వ్యక్తితో రూ.1.5 లక్షల విషయంలో ఓ గొడవ తలెత్తింది. ఆ గొడవను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక ప్రకారం దత్తాత్రేయను చంపించాడు అతుల్. ముందు దత్తాత్రేయ కొడుకు శుభంకు ఫోన్ చేసి అతుల్ ఓ బర్త్ డే పార్టీకి ఆహ్వానించాడు. వస్తూ తన వెంట బిరియానీ తీసుకురమ్మన్నాడు. ఈ విషయం దత్తాత్రేయకు చెప్పిన శుభం.. తన స్నేహితుడితో కలిసి బిరియానీ తీసుకుని అతుల్ దగ్గరికి వెళ్దామని బయల్దేరాడు. ఇంతలో దత్తాత్రేయ ఒంటరిగా అతుల్ దగ్గరికి వెళ్లాడు. ఐతే శుభం బిరియానీ తీసుకుని అక్కడికి వెళ్లేసరికి తన తండ్రిని అతుల్.. అతడి మనుషులు తీవ్రంగా కొడుతుండటం కనిపించింది. వీళ్లు రక్షించే ప్రయత్నం చేసేసరికే దత్తాత్రేయ ప్రాణాలు కోల్పోయాడు. అతుల్ అక్కడి నుంచి పారిపోయాడు.