Begin typing your search above and press return to search.
పునీత్ మరణం : అభిమానుల ఆత్మహత్యలు, గుండెపోటుతో మరణాలు
By: Tupaki Desk | 30 Oct 2021 12:30 PM GMTప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46 ) మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు.
పునీత్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు అని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
శాండిల్ వుడ్ హీరోలు వరుసగా చనిపోతుండడం ఆ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇదో శాపంగా మారిందని అంటున్నారు. కన్నడ ఇండస్ట్రీకి ఇదేం దురదృష్టమో అని నిట్టూరుస్తున్నారు. వరుసగా రెండు సంవత్సరాల్లో ముగ్గురు స్టార్ హీరోలను శాండల్ వుడ్ కోల్పోయింది.
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం తట్టుకోలేని అభిమానులు అనూహ్య ఘటనలకు పాల్పడుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణ వార్త విన్న వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరు చనిపోయినట్టు సమాచారం.
ఇక పునీత్ మరణ వార్త విని చామరాజు నగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే పునీత్ అభిమాని టీవీ చూస్తూ గుండెపోటుతో మరణించాడు. ఉడుపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన నటుడు పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తుండగా రిక్షాలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
అభిమానులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పలువురు సినీ ప్రముఖులు సూచిస్తున్నారు. గుండె ధైర్యంతో మెలగాలని హితవు పలుకుతున్నారు.