Begin typing your search above and press return to search.
కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసిన పంజాబ్ సీఎం.. ఏమన్నారంటే
By: Tupaki Desk | 18 Jan 2023 3:34 PM GMTఖమ్మంలో నిర్వభించిన బీఆర్ ఎస్ తొలి ఆవిర్భావ సభలో పాల్గొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మోడీకి లూటీ చేయడం.. అమ్మడమే తెలుసునని, బీజేపీది ఇదే సిద్ధాంతమని నిప్పులు చెరిగారు. కేంద్ర సంస్థలు ఎల్‌ఐసీ, రైల్వేశాఖ అమ్మకానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ``కొనేవాళ్లు ఉండాలే కానీ.. ప్రధాని మోడీ మనల్ని కూడా అమ్మేస్తారు`` అని మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఇదేసమయంలో తెలంగాణ సీఎంపై ఆయన ప్రసంశల జల్లు కురిపించారు. పంజాబ్‌లోనూ తెలంగాణ మాదిరి కార్యక్రమాలు చేపడతామన్న భగవంత్ మాన్.. మంచి కార్యక్రమాలు ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చన్నారు. మార్పునకు తొలి అడుగుగా ఖమ్మం సభ నిలిచిందని కొనియాడారు. అభివృద్ధిలో తెలంగాణను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. దేశంలోనే తెలంగాణ వెలుగులీనుతోందని మాన్ అన్నారు. సీఎం కృషి సహా రాష్ట్ర అభివృద్ధిపై ప్రశంసలు గుప్పించారు.
రాష్ట్రంలో 'కంటి వెలుగు' వంటి మంచి పథకం చేపట్టారన్నారు. ఖమ్మం సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడం మార్పునకు తొలి అడుగుగా భగవంత్ మాన్ పేర్కొన్నారు. 'పంజాబ్‌లో అవినీతిని రూపుమాపాం. అవినీతికి పాల్పడిన నేతలను జైళ్లకు పంపాం.
దేశం ఎటు వెళ్తుందోననే ఆందోళన నెలకొంది. కేంద్రం యువత, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. హామీలు నెరవేర్చకుండా భారతీయ జుమ్లా పార్టీగా మారింది. ఏటా 2 కోట్ల ఉపాధి కల్పిస్తామని మోసం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ నెరవేర్చలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోసం చేశారు`` అని మాన్ వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.