Begin typing your search above and press return to search.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం.. ఎవరితోనే తెలుసా..?
By: Tupaki Desk | 7 July 2022 12:32 PM GMTపంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది సమక్షంలో ఆయన వివాహ వేడుక నిరాడంబరంగా సాగింది. సిక్కు మతానికి చెందిన ఆయన వారి సాంప్రదాయం ప్రకారం వైద్యురాలు గురుప్రీత్ కౌర్ ను వివాహామాడారు. బంగారు వర్ణంలోని పెళ్లి డ్రెస్సులో సీఎం భగవంత్ మాన్ మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వేడుకకు ఆప్ జాతీయ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్ కు వివాహ శుభాకాంక్షలు అని ఆయన మీడియా ద్వారా తెలిపారు.
భగవంత్ మాన్ సోదరుడు రాహుల్ చద్దా ట్విటర్ ద్వారా ఈ పెళ్లి గురించి ప్రస్తావించారు. తన సోదరుడు రెండో పెళ్లి చేసుకోవాలని తన తల్లి ఎప్పటి నుంచో కోరుకుంటుందని అన్నారు. ఆ కోరిక నేడు నెరవేరిందని అన్నారు. అయితే కొందరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని కొందరు ట్విట్టర్ ద్వారా కొశ్చెన్ చేశారు. దీంతో ముందు పెద్దవాళ్ల పెళ్లి.. ఆ తరువాత నా పెళ్లి అని సరదాగా సమాధానం ఇచ్చాడు.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లికి కేవలం ఆయన తల్లి, సోదరుడు మాత్రమే హాజరయ్యారు. సెక్యూరిటీ దృష్ట్యా ఆయన ఎవరికీ సమాచారం ఇవ్వనట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీలకు చెందిన వారిలో కొద్ది మంది ఉన్నారు. ఎటువంటి భాజా భజంత్రీలు లేకుండా ఛండీగఢ్ లోని సెక్టార్ 2 లో అతికొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరగింది. ఈ పెళ్లిలో మాన్ బంగారు వర్ణంలోని కుర్తా ధరించారు. కౌర్ ఎరుపు రంగు లెహంగాలో కనిపంచారు.
భగవంత్ మాన్ రెండో భార్య గురుప్రీత్ ఓ డాక్టర్. ఆమె కురుక్షేత్రంలోని పెహ్వా ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె వయసు 32 ఏళ్లు. ఆమె తండ్రి ఇంద్రజిత్ రైతు. తల్లి మాతా రాజ్ కౌర్ గృహిణి. గురుప్రీత్ సోదరులిద్దరూ విదేశాల్లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా మాన్, గురుప్రీత్ కుటుంబాలు కలిసి ఉంటున్నాయి ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ముల్లానా వైద్య కళాశాలలో వైద్యవిద్యనభ్యసించిన కౌర్ గోల్డ్ మెడల్ సాధించారు. పంజాబ్ ఎన్నికల సమంలో భగవంత్ కు ఎంతో సాయంగా ఉన్నారు.