Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ వేళ పంజాబ్ లో ఘోరం..పోలీస్ చేయి నరికివేత
By: Tupaki Desk | 12 April 2020 8:15 AM GMTదేశమంతా లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ పక్కాగా అమలయ్యేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు - ప్రజల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటుండడంతో పోలీసులపై అక్కడక్కడ దాడులు చోటుచేసుకుంటున్నాయి. మరో రెండో విడత లాక్ డౌన్ కూడా విధించే అవకాశాలు ఉండడంతో ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉంది. తాజాగా పంజాబ్ లో ఘోర ఘటన జరిగింది. లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో ఆ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో పాటియాల జిల్లాలో ఏప్రిల్ 12వ తేదీన ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీస్ అధికారులు ఉలిక్కిపడ్డారు.
ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం పంజాబ్ లోని పాటియాల జిల్లాలో కూరగాయల మార్కెట్ లో లాక్ డౌన్ అలమయ్యేలా - ప్రజలు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సయమంలో ప్రజలను నియంత్రిస్తుండగా కొందరి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై పోలీసులతో వారు వాగ్వాద పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశంలో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో ఒక పోలీస్ అధికారి చేయి నరకగా మరో ఇద్దరి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఏఎస్ ఐ హర్జీత్ సింగ్ తో పాటు మండీ బోర్డు అధికారి గాయపడ్డారు. వెంటనే వారిని చంఢీగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడింది నిహంగ్ వర్గానికి చెందిన కొంతమంది అని గుర్తించారు. దాడి చేసిన అనంతరం నిందితులు పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆ నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో దాడి చేసిన ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితులను ఆపడానికి పోలీసులు కాల్పులు చేశారని.. ఈ ఘటనలో ఓ నిందితుడు గాయపడ్డారు. ప్రధాన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనను అందరూ ఖండించారు. ప్రజలు సహకరించాలని.. కొన్నాళ్లు ఓపిక పడితే పరిస్థితులు సద్దుమణుగుతాయని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఏప్రిల్ నెలాఖరు వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.