Begin typing your search above and press return to search.
బ్రేకింగ్:లాక్ డౌన్ ను మే 1 వరకు పొడగించిన మరో రాష్ట్రం
By: Tupaki Desk | 10 April 2020 12:30 PM GMTకరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే, ఈ లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం - మరణాలు సంభవిస్తుండడంతో లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్రాలే కేంద్రాన్ని కోరుతున్నాయి.
అయితే , కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 1 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా, దేశంలో లాక్ డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రం పంజాబ్ కావడం విశేషం. ఇంతకు ముందు ఒడిశా ప్రభుత్వం కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించింది.
పంజాబ్ లో ఇప్పటివరకు 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా - 8 మంది చనిపోయారు. నలుగురు కోలుకున్నారు. మరో నలుగురు వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పంజాబ్ లో 89 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అయితే , ఈ లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది అని ,సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. కాగా , దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ప్రధాని మోడీ రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం లాక్ డౌన్ పొడగింపు పై ఒక స్పష్టత రానుంది.