Begin typing your search above and press return to search.
ఇద్దరు సీఎంల మధ్య హనీప్రీత్ చిచ్చు పెట్టింది
By: Tupaki Desk | 6 Oct 2017 10:36 AM GMTడేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. హనీప్రీత్ హర్యానా - పంజాబ్ ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసింది. లైంగిక దాడి కేసులో ఆగస్టు 25న గుర్మీత్ కు కోర్టు శిక్ష విధించిన అనంతరం హింసను ప్రేరేపించి 41 మంది మృతి కారణమైన కేసులో హనీప్రీత్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హనీప్రీత్ అరెస్టు విషయంలో పంజాబ్ పోలీసుల తీరు సరిగా లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విమర్శించారు. హనీప్రీత్ 38 రోజులపాటు పంజాబ్‌లోనే తలదాచుకుందని, తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని పంజాబ్ ప్రభుత్వాన్ని హర్యానా సీఎం ప్రశ్నించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విమర్శలతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కౌంటర్ ఎటాక్ కు దిగారు.
హనీప్రీత్ అరెస్ట్ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర జరిగిందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ``మొదటి నుండి హనీప్రీత్ వ్యవహారం పంజాబ్ పోలీసులకు అంతా తెలుసు. హనీప్రీత్ ను ట్రాకింగ్ చేయటం... అరెస్ట్ అంతా వారి కనుసన్నలలోనే జరిగింది. హర్యానా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. కానీ, వాళ్లు అలా చేయలేదు. అందుకే అరెస్ట్ లో జాప్యం జరిగింది`` అని ఖట్టర్ వ్యాఖ్యానించారు. దీనికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం ఘాటుగానే స్పందించారు. ఎవరినీ రక్షించాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. తమ పోలీసులు నిబంధనల ప్రకారం
దర్యాప్తు చేశారని వివరించారు.
హనీప్రీత్ ను ఛండీగఢ్ హైవేలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెతోపాటు మరో మహిళ కూడా ఉంది. ఆ మహిళ విషయంలో కొత్త చర్చ మొదలైంది. పంజాబ్ నేత హర్మిందర్ సింగ్ జస్సీ కూతురు రామ్ రహీమ్ కొడుకును పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె సహకారంతోనే హనీప్రీత్ తప్పించుకోవాలని ప్రయత్నించిందని, తన పరపతిని ఉపయోగించి హనీకి భద్రత కల్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పంచకుల సెక్టార్-20 లోని రాంపూర్ జైల్లో విచారణ ఎదుర్కుంటున్న హనీప్రీత్ ఎలాంటి విషయాలను వెల్లడించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుందని తెలుస్తుంది.
మరోవైపు డేరా బాబా గుర్మీత్ కు యావజ్జీవ జైలుశిక్ష విధించాలని కోరుతూ లైంగిక దాడికి గురైన ఇద్దరు మహిళలు పంజాబ్ - హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అతని శిక్షను యావజ్జీవశిక్షకు పెంచాలని కోరుతూ రివిజన్ పిటిషన్ దాఖలు చేశామని బాధితుల తరఫు న్యాయవాది నవకిరణ్ సింగ్ చెప్పారు.