Begin typing your search above and press return to search.
16 ఏళ్లు నిండితే వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు!
By: Tupaki Desk | 20 Jun 2022 9:31 AM GMTముస్లిం బాలికలు 16 ఏళ్లు దాటిన తర్వాత తమ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. వివాహ జీవితంలోకి అడుగుపెట్టడానికి ఆ వయసు సరైందేనని స్పష్టం చేసింది. జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఓ ముస్లిం జంట కోర్టును ఆశ్రయించి రక్షణ కోరిన క్రమంలో హైకోర్టు ఇలా స్పందించింది.
21 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల అమ్మాయి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. ఫలితంగా వారు హైకోర్టును ఆశ్రయించి పిటీషన్ వేశారు. ప్రేమలో పడిన సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. జూన్ 8వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నామని తెలిపారు. పైగా వీళ్లు కోర్టులో మరో వాదన కూడా వినిపించారు.
ముస్లిం చట్టం ప్రకారం.. శారీరక మార్పులు వచ్చిన నాటి నుంచే వాళ్లు మేజర్ అయినట్టుగా గుర్తిస్తారని.. ఇలా చేస్తే 15 ఏళ్లకే తాము మెజార్టీ సాధించామని వాదించారు.
ఓ ముస్లిం అబ్బాయైనా.. అమ్మాయైనా మేజర్ అయ్యాక తమ ఇష్ట ప్రకారం.. నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. గార్డియన్లకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు లేదని కూడా వాదించారు.
ముస్లిం పర్సనల్ లా లో ఓ బాలిక ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చో స్పష్టంగా ఉందని అన్నారు. సర్ దిన్ షా ఫర్దున్ జీ ముల్లా రాసిన 'ప్రిన్సిపల్ ఆఫ్ మహమ్మదన్ లా' బుక్ లోని ఆర్టికల్ 195 ప్రకారం.. ఓ బాలికకు 16 ఏళ్లు వచ్చాక వివాహం చేసుకోవచ్చు. అబ్బాయికి ఖచ్చితంగా 21 ఏళ్లు నిండాల్సిందే. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరికీ వివాహ వయసు వచ్చింది కను వారి పెళ్లిని కాదనే హక్కు లేదని జస్టిస్ బేడి స్పష్టం చేశారు.
గత ఏడాది 17 ఏళ్ల ముస్లిం బాలిక, 36 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకునే విషయంలోనూ బాలికకు అనుకూలంగా హైకోర్టు ముస్లిం చట్టాల ప్రకారం ఆ బాలిక వివాహానికి అర్హత సాధించిందని స్పష్టం చేసింది.